Homeసినిమా8 Vasantalu Movie Review: 8 వసంతాలు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | 8...

8 Vasantalu Movie Review: 8 వసంతాలు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | 8 Vasantalu Movie Review and Rating in Telugu: Pure and Natural triangle love story

నటీనటులు: అనంతిక సనీల్ కుమార్, హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, కన్నా పసునూరి తదితరులు
రచన, దర్శకత్వం: ఫణీంద్ర నరిశెట్టి
నిర్మాత: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి
సంగీతం: హేషామ్ అబ్దుల్ వహబ్
సినిమాటోగ్రఫి: విశ్వనాథ్ రెడ్డి
ఎడిటింగ్: శశాంక్ మాలి
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
రిలీజ్ డేట్: 2025-06-20

ఊటీలో తేయాకు బిజినెస్‌ను కొనసాగించే తల్లికి అండగా ఉండే శుద్ది అయోధ్య (అనంతిక సనీల్ కుమార్) బహుముఖ ప్రజ్ఞాశాలి. యుక్త వయస్సులోనే రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లో పురుషులను కూడా మట్టికరిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాంటి యువతి తన జీవితంలో ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రయాణిస్తుండగా.. ఆమె లైఫ్‌లోకి వరుణ్ (హను రెడ్డి) ఎంట్రీ ఇస్తాడు. కాశ్మీర్‌లో వారిద్దరు తరుచూ కలుస్తుండటంతో ఒకరితో మరొకరిని విడదీయలేనంత ప్రేమ కలుగుతుంది. ఈ క్రమంలో శుద్ధికి వరుణ్ లవ్ ప్రపోజ్ చేస్తాడు. శుద్ది తన నిర్ణయం చెప్పాలనుకొన్న తరుణంలో వరుణ్ బ్రేకప్ చెప్పి అమెరికాకు వెళ్లిపోతాడు.

8 వసంతలు మూవీ సమీక్ష

శుద్ది అయోధ్య జీవిత లక్ష్యం ఏమిటి? ఆ లక్ష్యాన్ని అధిగమించడానికి ఏర్పడిన అవరోధం ఏమిటి? తన గురువు ప్రాణాలకు ఏర్పడిన ముప్పు ఆమెను ఎలా బాధించింది? వరుణ్‌పై ఎలాంటి ఆకర్షణకు లోనైంది. తనలోని ప్రేమను వ్యక్తీకరించే సమయంలో వరుణ్ ఎందుకు బ్రేకప్ చెప్పాడు? వరుణ్‌తో బ్రేకప్ కారణంగా మానసిక సంఘర్షణకు గురైన సమయంలో ఆమె సంజయ్‌ (రవి దుగ్గిరాల)కు ఎలా దగ్గరైంది? సంజయ్‌తో ఆమె ప్రయాణం ఎక్కడికి దారి తీసింది. వరుణ్, సంజయ్‌లో ఎవరి ప్రేమను గెలుచుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే 8 వసంతాలు సినిమా కథ.

ఓ యువతి, ఇద్దరు యువకుల మధ్య సాగే అందమైన ప్రేమ కథ. చాలా సింపుల్ పాయింట్. అయితే కథను దర్శకుడు ఫణీంద్ర సరైన విధంగా ట్రాక్ ఎక్కించాడు. ఫస్టాఫ్‌లో కథ, కథనాల్లో వేగం లేకపోయినా.. తన భాషా పాండిత్యం, సాహిత్యంపై అభురుచిని రంగరించి డైలాగ్‌ల రూపంలో ప్రేక్షకుడి హృదయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన తీరు బాగుంది. ప్రథమార్థంలో కథలోకి వెళ్లడానికి కాస్త టైమ్ ఎక్కువగానే తీసుకొన్నప్పటికీ.. తన సన్నివేశాల ద్వారా బలమైన ముద్ర వేసేందుకు ప్రయత్నించిన తీరును అభినందించాలి. ఈ సినిమా కథలో విషయం లేదా? ఏమిటి? సాగదీత అనే ఫీలింగ్ కలిగినప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్‌ను అద్బుతంగా డిజైన్ చేసి అదరగొట్టాడు. ఆ తర్వాత సెకండాఫ్‌పై అంచనాలు పెంచేలా చేశాడు.

ఇక సెకండాఫ్‌పై భారీగా అంచనాల పెట్టుకొన్న వారికి దర్శకుడు కాస్త నిరాశ పరిచాడనే చెప్పాలి. కథలోకి అనేక అంశాలు, పలు రకాల ఎపిసోడ్స్‌ను జొప్పించి కథ నుంచి డీవియేట్ అయ్యాడు. కోచ్ మరణం సీన్ గుండెను పిండేసేలా చేస్తుంది. ఇక వారణాసి ఎపిసోడ్ కథకు మంచి హుషారు తెప్పిస్తుంది. సినిమా సరైన ట్రాక్‌లో మళ్లీ వచ్చిందనుకొనే సమయంలో సంజయ్ క్యారెక్టర్‌ను తెచ్చి మళ్లీ సినిమాను దారి తప్పించాడనే ఫీలింగ్ కలిగిస్తాడు. చివరికి అనేక మలుపులు తిప్పి.. కథను సాగదీసి.. సాగదీసి ప్రేక్షకుల ఓపికకు ఓ పరీక్ష పెట్టి.. సినిమాను ముగించాడనిపిస్తాడు.

ముక్కోణ ప్రేమ కథలో శుద్ది అయోధ్యగా అనంతిక చెలరేగిపోయి నటించిందని చెప్పడం కంటే.. ఆ పాత్రలో జీవించిందని చెప్పాలి. చాలా మంది యువ హీరోలు ఆ యువ తారను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉందనిపిస్తుంది. కళల పట్ల మక్కువ, వాటిని తెరపైన ఆవిష్కరించిన తీరు, తన పాత్రలో ఒదిగిన తీరుకు హ్యాట్పాఫ్ చెప్పాలి. సన్నివేశానికి తగ్గ హవభావాలు, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌ను బ్రహ్మండంగా పలికించింది. మంచి కథలను, పాత్రలను ఎంచుకొంటే.. స్టార్ యాక్టర్‌గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాలో నటించిన లవర్ బాయ్‌గా నటించిన హనురెడ్డి తన లుక్స్, స్టయిల్‌తో ఆకట్టుకొన్నాడు. సంజయ్ డిఫరెంట్ మేనరిజంతో తన మార్కును వదిలాడు. ఈ సినిమా తెలిసిన ముఖాలు లేకపోయినా.. అందరూ గొప్పగా తెరపైన రాణించారు.

8 వసంతాలు కథకు అత్యంత బలం సాంకేతిక విభాగాల పనితీరు. ఈ మధ్య కాలంలో తెలుగు తెర మీద చూడని విధంగా విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫి అందించాడు. ప్రతీ సన్నివేశాన్ని ఓ పెయింటింగ్‌లా మార్చాడు. థియేటర్‌లో కాకుండా ప్రకృతి వనంలో విహరించామా? అనే అంతగా సన్నివేశాలను చిత్రీకరించాడు. అలాంటి సన్నివేశాలకు ఆర్ట్ డిపార్ట్‌మెంట్ అందించిన సహకారం మరో ఎత్తు. హేషామ్ మ్యూజిక్ ఈ సన్నివేశాలకు ప్రాణం పోసింది. మైత్రీ మూవీస్ అనుసరించిన నిర్మాణ విలువలు అద్బుతంగా ఉన్నాయి. వారు నిర్మించిన విధానం చూస్తే.. సినిమాపై వారికి ఉన్న అభురుచి ఏమిటో మరోసారి తెలుస్తుంది.

తెలుగు సినిమా పరిశ్రమలో ఫ్రెష్ థాట్‌తో ఇటీవల కాలంలో వచ్చిన మంచి ప్రేమ కథా చిత్రం 8 వసంతాలు. అయితే దర్శకుడి అత్యుత్సాహం, ప్రేక్షకుడికి మరింతగా గొప్ప అనుభూతిని పంచాలనే తపన కారణంగా సింపుల్‌గా చెప్పాల్సిన కథను చాలా క్లిష్టమైన పంథాలో చెప్పడం ఈ సినిమాకు మైనస్‌గా మారింది. ఇంటర్వెల్ వరకు అద్బుతంగా కథను చెప్పిన ఆయన రెండో భాగంలో గాడి తప్పాడు. సినిమాలో కొన్ని సన్నివేశాలు మాత్రం ఆలోచింపజేస్తాయి. మరికొన్ని భావోద్వేగానికి గురి చేస్తాయి. ఆయన రాసిన డైలాగ్స్ వెయిట్ ఎక్కువ సన్నివేశాలు పేలవంగా మారాయి. భావుకత, సాహిత్యంపై పట్టు ఎక్కువగాను ఉండోచ్చు. అయితే సినిమాకు ఎంత పంచాలో తెలుసుకొని.. అంతే పంచితే సినిమాకు ఓ బ్యూటీ ఉండేది. ఈ సినిమా ఫలితం ఏదైనా కర్త, కర్మ, క్రియ ఫణీంద్రనే. అనంతిక అనే మంచి ఆర్టిస్టును తెలుగు పరిశ్రమకు అందించిన క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి. ఇక ఈ సినిమా నిజంగా స్వచ్చమైన ప్రేమ కథ. సాగదీత, గజిబిజి ఎక్కువైనప్పటికీ.. ప్రేమ కథలను ఆదరించే వారికి, ఇష్టపడే వారికి ఈ సినిమా ఓ కొత్త అనుభూతనిి ఇస్తుంది. ఆ అనుభూతిని మీరు పొందే ప్రయత్నం చేయండి.

https://www.youtube.com/watch?v=appme4nmcji

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Extramarital Affair: భర్తకు బిర్యానీ పెట్టి.. బెడ్రూంలో బాయ్‌ఫ్రెండ్‌తో అరాచకం.. నైట్ అంతా అదే పని | ట్రెండింగ్

0
చివరిగా నవీకరించబడింది:జనవరి 22, 2026 3:16 PM ISTExtramarital Affair: వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తతో కలిసి 15ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఆ వివాహితకు మరో వ్యక్తితో పరిచయం భర్తను...

CMAT అడ్మిట్ కార్డ్ 2026 cmat.nta.nic.inలో విడుదల చేయబడింది, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

CTET పరీక్ష సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇంటిమేషన్ స్లిప్ త్వరలో ctet.nic.inలో...

నవీకరించబడింది: జనవరి 22, 2026 9:46:33 AM ISTCTET పరీక్ష సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇంటిమేషన్ స్లిప్ త్వరలో ctet.nic.inలో విడుదల కానుందిCTET పరీక్ష సిటీ...

CUET PG 2026: రిజిస్ట్రేషన్ తేదీ జనవరి 23 వరకు పొడిగించబడింది, ఇక్కడ నోటీసును తనిఖీ చేయండి

CUET PG 2026 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగించబడింది. అధికారిక ప్రకటనను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. Source link

JEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష...

నవీకరించబడింది: జనవరి 21, 2026 9:17:54 AM ISTJEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష రోజు సూచనలను తనిఖీ చేయండిJEE...

error: Content is protected !!