చివరిగా నవీకరించబడింది:
ANU Fake certificates: డిగ్రీలు చదివి చేతిలో సర్టిఫికేట్ ఉంటే మంచి ఉద్యోగం లభిస్తుంది, కానీ అవి నకిలీ సర్టిఫికేట్లు అయితే కనీసం ఉన్నత చదువులకు ప్రవేశం కుడా దొరకదు. ఇది విద్యార్థుల తప్పిదం కాదు, కావాలని అధికారులే ఇలా చేశారు. మిగతా వివరాలు ఇలా..
Acharya Nagarjuna University: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని ఉన్న ప్రముఖ విద్యా సంస్థ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రధానంగా కళాశాలలు, కాలేజీలు మరియు పరిశోధన కేంద్రాలను కలిగి ఉంది. ఈ విశ్వవిద్యాలయం అనేక విభాగాలలో పీహెచ్‌డీ, మాస్టర్స్, బ్యాచలర్స్, మరియు డిప్లొమా కోర్సులను అందిస్తోంది. ఏఎన్‌యూ తమ విద్యార్థులకు పర్యవేక్షణ లేకుండా నకిలీ సర్టిఫికేట్లను ఇస్తుంది. ఈ నకిలీ ధృవపత్రాలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీయవచ్చు, ఎందుకంటే అవి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు లేదా విద్య సంబంధిత అనుమతులను పొందడంలో తీవ్ర సమస్యలకు కారణమవుతాయి. ఇది ఒక క్రిమినల్ చర్యగా పరిగణించబడుతుంది, మరియు ఎవరైనా ఈ విధంగా నకిలీ ధృవపత్రాలను ఉత్పత్తి చేస్తే, వారి పై శిక్షా చర్యలు తీసుకోవడమే కాకుండా, విద్యాసంస్థలకు ప్రతికూల ప్రభావం కలిగిస్తుంది.కళాశాల అధికారులే నకిలీ పత్రాలు ఇవ్వడంపై విద్యార్థులు, తల్లితండ్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఇందులో కేవలం యూనివర్సిటీ అధికారుల పాత్రే ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసే ఒరిజినల్ సర్టిఫికేట్లకు బదులుగా ఎందుకు నకిలీ సర్టిఫికేట్లు ఇస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ నకిలీ సర్టిఫికేట్లు నాగార్జున విశ్వవిద్యాలయ పీజీ స్పాట్ అడ్మిషన్లలో బయటపడ్డాయి. నాలుగు రోజులుగా ఈ ఘటన విద్యార్థుల్లో ఆందోళన సృష్టిస్తుంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయలంలో పది రోజుల క్రితం పీజీ కోర్సుల ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించారు. డిగ్రీ అదే కళాశాలలో చదువుకున్న విద్యార్థులు పీజీ ప్రవేశం కోసం ఆ సర్టిఫికేట్లు పట్టుకుని అక్కడికి వెళ్లగా ఈ బాగోతం బయటకొచ్చింది. ఆ కళాశాలలో డిస్టెన్స్‌లో చదువుకున్న స్టూడెంట్స్ పీజీ ప్రవేశం కోసం వచ్చి ఆ నకిలీ దృవపత్రాలను సమర్పించారు.
అప్పుడే రెగ్యులర్‌గా డిగ్రీ చదివిన నలుగురువి, డిస్టెన్స్‌లో చదివిన ఐదుగురు విద్యార్థుల సర్టిఫికెట్లు నకిలీవిగా అడ్మిషన్ కేంద్రంలోని ఉద్యోగులు నాలుగు రోజుల క్రితం గుర్తించారు. తర్వాత వర్సిటీ సర్వర్లో పరిశీలించగా ఆ తొమ్మిది మంది ఒరిజినల్ సరిఫికెట్లు లేవు. ఈ సంవత్సరం జూన్ నెలలో ఈ నకిలీ సర్టిఫికెట్లు వర్సిటీ నుంచి జారీ అయినట్లుగా ఉంది. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా నాలుగు రోజులగా మౌనం పాటిస్తున్నారు. వర్సిటీ ఉన్నతాధికారులు సర్టిఫికెట్లు ఇచ్చినట్లుగా వారి సంతకాలు ద్రువపత్రాలపై ఉన్నాయి. కానీ వెరిఫికేషన్ సమయంలో ఆ సర్టిఫికెట్లు నకిలీవి అని తేల్చారు. అధికారులకు తెలిసే ఈ నకిలీల సర్టిఫికేట్ల వ్యవహారం జరిగిందని అందువల్లే వారు మౌనం పాటిస్తున్నారని అనుమానిస్తున్నారు. అధికారక సంతకాలు ఉండటంతో వారు చర్యలకు, పోలీసులకు ఫిర్యాదుకు వెనుకడుగు వేస్తున్నారని సమాచారం. ఈ సమస్యను పరిష్కరించడానికి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థులకు అధికారిక ధృవపత్రాలు మాత్రమే జారీ చేయడంపై కఠినమైన పర్యవేక్షణ విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది. అలాగే, విద్యార్థులు తమ ధృవపత్రాలను సులభంగా ధృవీకరించుకునేలా డిజిటల్ మరియు ఆన్‌లైన్ పద్ధతులను ఉపయోగించటం చాలా ముఖ్యం. ఈ సందర్భంలో, ఎవరూ నకిలీ ధృవపత్రాలను ఉపయోగించడం వల్ల తన భవిష్యత్తును ప్రమాదంలో పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో మాత్రమే కాకుండా, ఇతర విద్యాసంస్థల విషయంలో కూడా సరైన చర్యలు తీసుకోవడం చాలా అవసరం.
లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ మేళా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, లేటెస్ట్ కోర్సులు, స్కాలర్షిప్స్, విద్యకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో తెలుసుకోండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
హైదరాబాద్, తెలంగాణ
డిసెంబర్ 15, 2024 12:23 PM






















