తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు వర్షాల కంటే గాలులతో ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా.. అల్పపీడనం ఉన్నప్పుడు ఈదురు గాలులు వీస్తాయి. కానీ.. ఇప్పుడు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేకపోయినా.. బలమైన ఈదురు గాలులు మాత్రం వీస్తున్నాయి. గంటకు 50 కిలోమీటర్లకు పైగా వీస్తున్న గాలులు.. అదే జోరుతో.. ఏపీ, తెలంగాణలోకి వస్తున్నాయి. అందువల్ల మనం ఏ పని చేసినా, గాలులను దృష్టిలో పెట్టుకొని, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.

























