ఓ మంచి ఆనందం కలిగించే వార్తను భారత వాతావరణ శాఖ చెప్పింది. ఈ నెల 24 వరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉపరితలంపై బలమైన చల్లగాలులు వీస్తాయని తెలిపింది. గాలి వేగం గంటకు 40 నుంచి 60 కిలోమీటర్లు ఉంటుందని చెప్పింది. అంతేకాదు.. జూన్ 27 వరకూ.. కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలో పిడుగులు, మెరుపులతో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని చెప్పింది.

























