చివరిగా నవీకరించబడింది:
కాకినాడ సమీపంలో ఉన్న వాటర్ వరల్డ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. స్విమ్మింగ్ పూల్, బ్రేక్ డాన్స్ వాటర్, నేచురల్ వాటర్ ఫాల్స్ వంటి అనేక ఆకర్షణలు ఉన్నాయి.
రాష్ట్రంలోనే ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన కాకినాడ సమీప ప్రాంతంలో ఏర్పాటు చేసిన వాటర్ వరల్డ్ మరో ప్రపంచంగా అందరినీ కట్టిపడేస్తుంది. వేసవికాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ వాటర్ వరల్డ్ గతంలో ఎన్నడూ లేనివిధంగా నిర్వాహకులు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళామా, పొరపాటున మన సమస్యలు మన ఒడిదుడుకులు అన్నీ మరిచిపోయి మధురమైన ఆనందంలో గడుపుతాం అంటే మీరు నమ్ముతారా? తప్పక నమ్మాల్సిందే. ఎందుకంటే వాటర్ వాల్డ్ అలా కట్టిపడేస్తుంది మరి.
కాకినాడ జిల్లా రూరల్ సముద్ర తీర ప్రాంతం ఉప్పాడ సమీపాన గ్లాస్ బ్రిడ్జ్ సమీపాన శిల్పారామం ప్రాంతంలో జానుస్ ది వాటర్ ల్యాండ్ పేరుతో వాటర్ వరల్డ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సముద్ర తీర ప్రాంతంలో ఈ వాటర్ ల్యాండ్ నిర్వాహకులు ఏర్పాటు చేశారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్నీ అక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వాటర్ వరల్డ్ లో స్విమ్మింగ్ పూల్‌లో స్నానంతో పాటు ప్రత్యేకమైన బ్రేక్ డాన్స్ వాటితో పాటు నేచురల్ వాటర్ ఫాల్స్ అయితే ఏర్పాటు చేశారు. కొండల ప్రాంతం నుంచి జాలు వారుతున్న నీరు, ఆ నీటి కింద ముఖ్యంగా వాటర్‌ఫాల్ కింద స్నానం చేసే విధంగా అక్కడ సెట్టింగ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.
ఇది ప్రధానమైనది అయితే, ఇక మళ్ళీ అక్కడే ఉన్న చిన్న వాటర్‌ఫాల్‌లో స్నానం ఆచరించే సమయంలో అనేక రకాల మోడల్స్ నుంచి వచ్చే వాటర్ మనపై పడుతూ ఉంటుంది. అది చాలా సరదా సరదాగా అనిపిస్తుంది. అక్కడి నుంచి రెండవదిగా బ్రేక్ డాన్స్ వాటర్ అని చెప్పుకోవచ్చు. మనం అక్కడ వస్తున్న పాటలకు డాన్స్ చేస్తూ మనపై నేచురల్‌గా వర్షం పడేటప్పుడు నీరు ఏ విధంగా పడుతుందో అదేవిధంగా అక్కడ పడుతూ ఉంటుంది. అన్‌లిమిటెడ్ ఎంజాయ్ అంటే ఇందులో ఉంటుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఇక మూడవదిగా మెయిన్ వాటర్ వరల్డ్ అని చెప్పుకోవచ్చు. సరదా సరదాగా మనకి ఎంతసేపు స్నానం చేయాలనిపిస్తే అంతసేపు చేసే విధంగా ఉన్న స్విమ్మింగ్ పూల్ అదే విధంగా పక్కన మెట్ల నుంచి మూడు అంతస్తులు పైకి ఎక్కి దాదాపు నాలుగు రకాల రౌండ్ భారీ బేసిన్‌లో నుంచి దూకే ఏర్పాట్లు సైతం చేశారు. పిల్లలకు, పెద్దవాళ్ళకు తగ్గట్టుగా ఏర్పాటు చేశారు.
అయితే ఒక రకంగా అది కాస్త భయాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యువత 16 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు కుర్రకారులు ఎక్కువగా ఆ పైనుంచి నీటిలో దూకుతూ సరదా సరదాగా గడుపుతున్నారు. నాన్‌స్టాప్‌గా మొదటి నుంచి చివరి వరకు కనీసం ఒక్కొక్కటి 15 నిమిషాలు సమయం కేటాయించిన రెండు గంటల సమయం పడుతుంది. ఇలా రోజంతా అక్కడ సరదా సరదాగా గడిపే విధంగా ఈసారి ఈ వాటర్ వరల్డ్ ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ వాటర్ వరల్డ్‌కి వెళ్ళాలి అంటే కాకినాడ నుంచి ఉప్పాడకు వెళ్లే రహదారిలో మనకు అద్దాల గ్లాస్ బ్రిడ్జ్ పార్క్ ముందు కుడివైపు శిల్పారామంలో మనకు కనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్
జూన్ 19, 2025 3:15 PM
























