తెలంగాణ అభ్యంతరాలకు ఏపీ కౌంటర్:
ఇటీవలే తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం-బనకచెర్ల ప్రాజెక్టు నీటి పంపకాల నిబంధనలను ఉల్లంఘిస్తోందని, అనుమతులు లేవని ఆరోపిస్తూ దానిని తిరస్కరించాలని కేంద్రాన్ని కోరారు. దీనిపై స్పందించిన నిమ్మల రామానాయుడు, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్టు కేవలం పోలవరం వద్ద అందుబాటులో ఉన్న వరద నీటిని మాత్రమే ఉపయోగిస్తుంది. దీనివల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదు. రాయలసీమకు సాగునీరు, తాగునీరు అందుతాయి” అని భరోసా ఇచ్చారు.
























