చివరిగా నవీకరించబడింది:
AP Assembly Meetings:ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. ఈనెల 21నుంచి 27వ తేది వరకు సభ కొనసాగనుంది. ఇక శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానం, చర్చించాల్సిన అంశాలపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఎవరికి వారు బుధవారం చర్చలు జరిపాయి.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు (Assembly Meetings)నేటి నుంచి జరగనున్నాయి. ఈనెల 21నుంచి 27వ తేది వరకు సభ కొనసాగనుంది. ఇక శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానం, చర్చించాల్సిన అంశాలపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఎవరికి వారు బుధవారం చర్చలు జరిపారు. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాలు స్కిల్ స్కాం కేసు చుట్టూ తిరిగే అవకాశం ఉంది. గత టీడీపీ పాలనలో అంతా అవినీతే జరిగిందనే విషయంపై సభలో ఎండగట్టాలని వైసీపీ తీర్మానించుకుంది. మరోవైపు సమావేశాలకు హాజరయ్యే విషయంపై టీడీపీ నేతలు బుధవారం భేటీ అయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అరెస్ట్ అక్రమం అనే విషయాన్ని సభలో గట్టిగా నినదించాలని నిర్ణయించుకున్నారు. చర్చించేందుకు మైక్‌లు ఇవ్వకపోయినా..సభ నుంచి సస్పెండ్ చేసినా ..చంద్రబాబు అంశంపైనే ఉద్యమించాలని బలంగా ఫిక్సయ్యారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ పోటాపోటీ విమర్శల మధ్య నేడు ఉదయం 11గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఉద్యమించాలనే నిర్ణణం..
తగ్గేదేలే ..
చంద్రబాబు అరెస్ట్ అక్రమం అనే నినాదాన్ని సభలో వినిపించాలని..దానిపై చర్చించేందుకు మైక్ ఇవ్వకపోయినా..లేదంటే సభ్యుల్ని సస్పెండ్ చేసినా అసెంబ్లీ బయటకు వచ్చిన అదే అంశంపై పోరాడాలని నిర్ణయించింది టీడీఎల్పీ. అసెంబ్లీ సెషన్స్ జరిగిన అన్ని రోజులు చంద్రబాబు అరెస్ట్ ప్రభుత్వ కుట్రలో భాగమనే విషయాన్ని సభలో, బయట వినిపించాలని టీడీపీ ఎమ్మెల్యేలు ఫిక్సయ్యారు. అవసరమై ఆందోళనలు, వినూత్న నిరసనలతో హోరెత్తించాలని తీర్మానించారు.
పోటా పోటీ ..
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుప్పంపల్లె, కృష్ణ, ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 21, 2023 6:49 AM

























