చివరిగా నవీకరించబడింది:
AP Politics: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కి కలిపి చెక్ పెట్టాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లున్నారు. అందుకే ఇప్పుడు ఆ మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా కనిపిస్తోంది.
ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన అధికార పార్టీ వైసీపీ(YCP) ఇప్పుడు నియోజకవర్గ ఇన్చార్జులను మార్చడం, పార్టీలో అసమ్మతి ఎమ్మెల్యేల సెగ, ప్రతిపక్ష పార్టీల ఎత్తులను చిత్తు చేయడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. గత కొద్దికాలంగా వైసీపీకి దూరంగా..హైదరాబాద్(Hyderabad)కే పరిమితమైన వైఎస్ జగన్ తల్లి విజయమ్మ(Vijayamma), సోదరి వైఎస్ షర్మిల(Sharmila)కు మళ్లీ ఏపీ రాజకీయాల్లో కీ రోల్ పోషించే సమయం వచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీలో పెరిగిన అసమ్మతి, తమ కుటుంబ అన్యోన్యతపై టీడీపీ చేస్తున్న విమర్శలకు బదులివ్వాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన తల్లిని కమలాపురం (Kamalapuram)అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సోదరి షర్మిలను కడప(Kadapa) ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అంతే కాదు ఈ పోటీకి వైఎస్ షర్మిలను ఒప్పించే బాధ్యతను తన తల్లి విజయమ్మకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ ఇంతటి షడన్ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని ఆపార్టీకి చెందిన కొందరు నేతలు లీకులు ఇస్తున్నారు.ఏపీలో విజయమ్మ, షర్మిల పోటీ..?ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు 175సీట్లకు 175 గెలుస్తామని శపథం చేసిన వైఎస్ జగన్..షడన్ గా గెలుపు అవకాశం తక్కువగా ఉన్న అభ్యర్ధులను మార్చి వారి స్థానంలో వేరే వాళ్లకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. జగన్ నిర్ణయంతో టికెట్ రాదని తెలిసిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు వైసీపీకి రాజీనామాలు చేస్తున్నారు. హైకమాండ్ పట్ల తిరుగుబాటుకు కూడా సిద్దమయ్యారు. అయితే వీళ్లలో కొందరు పార్టీ మారే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనికి తోడు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తుపెట్టుకొని పోటీకి దిగుతుండటంతో జగన్ పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. అందుకే పార్టీకి నష్టం కలగకుండా..అధికారం చేజారిపోకుండా ఉండేందుకు కొంతకాలంగా దూరంగా ఉంటున్న తన తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిలను దగ్గరకు చేర్చుకొని పోటీలో నిలబెట్టాలని చూస్తున్నారట. ఇందులో భాగంగానే వైఎస్ షర్మిలను కడప ఎంపీ స్థానం నుంచి..తల్లి విజయమ్మను కమాలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని చూస్తున్నారని సమాచారం. అయితే ఈనిర్ణయానికి వైఎస్ షర్మిలను ఒప్పించేలా చూడాలని విజయమ్మను కోరినట్లుగా తెలుస్తోంది.
ఏపీలో విజయమ్మ, షర్మిల పోటీ..?
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు 175సీట్లకు 175 గెలుస్తామని శపథం చేసిన వైఎస్ జగన్..షడన్ గా గెలుపు అవకాశం తక్కువగా ఉన్న అభ్యర్ధులను మార్చి వారి స్థానంలో వేరే వాళ్లకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. జగన్ నిర్ణయంతో టికెట్ రాదని తెలిసిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు వైసీపీకి రాజీనామాలు చేస్తున్నారు. హైకమాండ్ పట్ల తిరుగుబాటుకు కూడా సిద్దమయ్యారు. అయితే వీళ్లలో కొందరు పార్టీ మారే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనికి తోడు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తుపెట్టుకొని పోటీకి దిగుతుండటంతో జగన్ పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. అందుకే పార్టీకి నష్టం కలగకుండా..అధికారం చేజారిపోకుండా ఉండేందుకు కొంతకాలంగా దూరంగా ఉంటున్న తన తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిలను దగ్గరకు చేర్చుకొని పోటీలో నిలబెట్టాలని చూస్తున్నారట. ఇందులో భాగంగానే వైఎస్ షర్మిలను కడప ఎంపీ స్థానం నుంచి..తల్లి విజయమ్మను కమాలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని చూస్తున్నారని సమాచారం. అయితే ఈనిర్ణయానికి వైఎస్ షర్మిలను ఒప్పించేలా చూడాలని విజయమ్మను కోరినట్లుగా తెలుస్తోంది.
చెల్లిని ఒప్పించే బాధ్యత తల్లికి అప్పగింత..
అయితే వైఎస్ జగన్ నిర్ణయం వెనుక పెద్ద మతలబే ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా ఆదిశగానే అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఇందుకు వైఎస్ షర్మిలను అడ్డుపెట్టుకొని జగన్ కి రాజకీయంగా చెక్ పెట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని చేసి లబ్ది పొందాలని భావించింది. అదే జరిగితే ఓవైపు టీడీపీ-జనసేన కూటమి, మరోవైపు కాంగ్రెస్ వల్ల తమ పార్టీకి డ్యామేజ్ జరగడం ఖాయమని భావించే జగన్ తల్లిని, చెల్లిని చేరదీసుకొని తమ పార్టీ తరపున పోటీలో దింపితే రెండు పార్టీలకు చెక్ పెట్టడంతో పాటు సొంత పార్టీ నేతలు కూడా సెంటిమెంట్ కి కనెక్ట్ అయి తమతోనే ఉంటారని ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ కు చెక్ పెట్టడానికేనా..
కాంగ్రెస పన్నాగాన్ని ముందుగానే పసిగట్టి జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇక తెలంగాణలో పాదయాత్ర చేసినా వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిలకు ఇప్పటి వరకు ఎలాంటి పదవులు దక్కలేదు. అయితే తన పుట్టిన రోజు నాడు తన అన్నయ్య జగన్ ఇచ్చిన ఈ కానుకను షర్మిల స్వీకరిస్తారా లేక వ్యతిరేకిస్తారా అనేది తెలియడం లేదు. ఏపీలో ప్రభుత్వ పాలన బాగోలేదని గతంలో ఎద్దేవా చేసిన షర్మి్లను తిరిగి ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేయడానికి ఒప్పించడం విజయమ్మ వల్ల అయ్యే పనేనా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుంటూర్, ఆంధ్రప్రదేశ్
డిసెంబర్ 18, 2023 9:54 PM






















