చివరిగా నవీకరించబడింది:
ఏపీ మాజీ సీఎం,టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ పై జైలు నుంచి వచ్చిన చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.మధ్యాహ్నం హైకోర్టు ఈ కీలక తీర్పు ప్రకటించింది.
ఏపీ మాజీ సీఎం,టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు (Chandrababunaidu) ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ పై జైలు నుంచి వచ్చిన చంద్రబాబుకు ఏపీ హైకోర్టు (AP High Court)రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.మధ్యాహ్నం హైకోర్టు ఈ కీలక తీర్పు ప్రకటించింది. దీంతో ఆయన ఈనెల 28న జైలుకు వెళ్లాల్సిన అవసరం లేకుండాపోయింది.బిగ్ రిలీఫ్..టీడీపీ చీఫ్ నారా చంద్రబాబునాయుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ స్కిల్ స్కాం కేసులో న్యాయస్థానం ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈకేసులో మధ్యంతర బెయిల్ పై విడుదలైన చంద్రబాబు ఈనెల 28న జైలుకు వెళ్లాల్సి ఉండగా..చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టులోబెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించారు.దీంతో ఆయనపై ఆంక్షలు ఈనెల 28వరకు మాత్రమే వర్తిస్తాయని న్యాయస్థానం తెలిపింది.చంద్రబాబు నవంబర్ 29 నుండి రాజకీయ చర్చలు, ర్యాలీలు, కు బహిరంగ సభలకు అనుమతి ఇచ్చింది.
బిగ్ రిలీఫ్..
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబునాయుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ స్కిల్ స్కాం కేసులో న్యాయస్థానం ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈకేసులో మధ్యంతర బెయిల్ పై విడుదలైన చంద్రబాబు ఈనెల 28న జైలుకు వెళ్లాల్సి ఉండగా..చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టులోబెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించారు.దీంతో ఆయనపై ఆంక్షలు ఈనెల 28వరకు మాత్రమే వర్తిస్తాయని న్యాయస్థానం తెలిపింది.చంద్రబాబు నవంబర్ 29 నుండి రాజకీయ చర్చలు, ర్యాలీలు, కు బహిరంగ సభలకు అనుమతి ఇచ్చింది.
తమ్ముళ్ల ఆనందం..
చంద్రబాబు నాయుడుకి స్కిల్ స్కాం కేసులో ఊరట లభించడంపై టీడీపీ శ్రేణులు పండగ చేసుకుంటున్నారు. పలుచోట్ల ఆలయాల్లో పూజలు చేస్తున్నారు.కొందరు పార్టీ కార్యకర్తలు మొక్కులు చెల్లించుకుంటున్నారు.చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడం, లోకేష్ యువగళం పాదయాత్ర తిరిగి కొనసాగుతుందనే ప్రకటన ఒకే రోజు రావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.
ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు..
సోమవారం ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన తీరు సరిగా లేదనీ.. ఈ కేసును కొట్టివెయ్యాలనీ, బెయిల్ ఇవ్వాలనీ ఆయన తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూత్రా ఇటీవల వాదనలు వినిపించారు. అటు.. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదనలు వినిపించారు. కేసీ కీలక దశలో ఉందనీ, ఈ దశలో చంద్రబాబుకి బెయిల్ ఇస్తే, సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించారు. రెండువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మధ్యాహ్నం అనంతరం తీర్పిచ్చింది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
విజయవాడ, కృష్ణ, ఆంధ్రప్రదేశ్
నవంబర్ 20, 2023 2:37 PM






















