చివరిగా నవీకరించబడింది:
TDP vs YCP: వైసీపీ పనైపోయిందని టీడీపీ విమర్శిస్తే ..టీడీపీ, జనసేన నాయకులు అడుగు ఊడిపోయిన బకెట్ తో సమానం అని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. నిన్న పోలేపల్లి సభలో వైసీపీ,జగన్ పై చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ చేసిన విమర్శలకు అంతే ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు అధికార పార్టీకి చెందిన నేతలు.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. కాని ఆంధ్రప్రేదశ్(Andhra Pradesh) లో అధికార వైసీపీ(YCP) ప్రతిపక్ష టీడీపీ(TDP)ని విమర్శించే విధానం కొత్తగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బుధవారం భోగాపురం మండలం పోలేపల్లి దగ్గర లోకేష్ (Lokesh)పాదయాత్ర యువగళం ముగింపు సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహించింది తెలుగుదేశం పార్టీ. ఆసభా వేదికపై వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు పార్టీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైసీపీ పనైపోయిందని..జగన్ ఓడిపోతారని..మూడు నెలల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani), చంద్రబాబు చేసిన కామెంట్స్ పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యేలకు ట్రాన్స్ ఫర్లు ఉంటాయా అనే చేసిన కామెంట్ పై చంద్రగిరి నుంచి కుప్పం మారడం ట్రాన్స్ ఫర్ కాదా అంటూ చంద్రబాబు(Chandrababu) విమర్శల్ని తిప్పికొట్టారు. పవన్ కల్యాణ్, లోకేష్, చంద్రబాబు అడుగు ఊడిపోయిన బకెట్లతో సమానం అని తనదైన స్టైల్లో పంచ్ లు పేల్చారు. ఇక ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు కూడా లోకేష్ పాదయాత్ర అట్టర్ ప్లాప్ అని..ఆ సభ ఇంకా అట్టర్ ఫ్లాప్ అంటూ తీసిపారేశారు.వాళ్ల వల్ల ఏం జరగదు..టీడీపీ నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర ముగియడంతో పోలేపల్లిలో యువగళం నవశకం విజయోత్సవ సభ నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని టీడీపీ సభ సక్సెస్ అయిందని పార్టీ శ్రేణులు భావిస్తున్న సమయంలో వైసీపీకి చెందిన మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు ఎక్కుపెట్టారు. టీడీపీ-జనసేన కలిసినా వైసీపీ వచ్చే నష్టం ఏమి లేదని తనదైన స్టైల్లో చెప్పారు కొడాలి నాని. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ అడుగు ఊడిపోయిన బకెట్ తో సమానం అని చురకలంటించారు.సీఎం జగన్ 2009లో యుద్ధం మొదలుపెట్టారని.. పవన్ ,లోకేష్, చంద్రబాబు ఇప్పుడు గంటల మోగిస్తూ యుద్ధభేరి మొదలెట్టిన…. జగన్ జైత్రయాత్ర పరంపరను ఆపలేరని కామెంట్ చేశారు కొడాలి నాని.
వాళ్ల వల్ల ఏం జరగదు..
టీడీపీ నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర ముగియడంతో పోలేపల్లిలో యువగళం నవశకం విజయోత్సవ సభ నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని టీడీపీ సభ సక్సెస్ అయిందని పార్టీ శ్రేణులు భావిస్తున్న సమయంలో వైసీపీకి చెందిన మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు ఎక్కుపెట్టారు. టీడీపీ-జనసేన కలిసినా వైసీపీ వచ్చే నష్టం ఏమి లేదని తనదైన స్టైల్లో చెప్పారు కొడాలి నాని. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ అడుగు ఊడిపోయిన బకెట్ తో సమానం అని చురకలంటించారు.సీఎం జగన్ 2009లో యుద్ధం మొదలుపెట్టారని.. పవన్ ,లోకేష్, చంద్రబాబు ఇప్పుడు గంటల మోగిస్తూ యుద్ధభేరి మొదలెట్టిన…. జగన్ జైత్రయాత్ర పరంపరను ఆపలేరని కామెంట్ చేశారు కొడాలి నాని.
పవన్, లోకేష్, చంద్రబాబుపై కొడాలి పంచ్ లు..
12 ఏళ్ల క్రితం యుద్ధభేరి మోగించిన సీఎం జగన్ సోనియాను కూకటి వేళ్లతో పేకలించి… చంద్రబాబును భూస్థాపితం చేసి….పవన్ కళ్యాణ్ ను రెండు చోట్ల చిత్తు ,చిత్తుగా ఓడించారని విమర్శించారు. మంగళగిరిలో లోకేష్ కు సమాధి కట్టారంటూ తనదైన స్టైల్లో సెటైర్ వేశారు. ఎమ్మెల్యేలకు ట్రాన్స్ ఫర్లు ఉంటాయా అంటూ చంద్రబాబు విచిత్రంగా మాట్లాడుతున్నారని..30 ఏళ్ల క్రితమే చంద్రబాబు చంద్రగిరి నుండి కుప్పం ట్రాన్స్ ఫర్ కాలేదా అని ప్రశ్నించారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.లోకేష్ పుట్టింది మంగళగిరిలోనా…. పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకలో గోలీలు ఆడుకున్నాడా అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు వైసీపీ ఎమ్మెల్యే.
పొత్తు నేతల్ని వదలని మంత్రులు..
ఇక జనసేన, టీడీపీ పొత్తుతో పాటు పవన్ , చంద్రబాబు, లోకేష్ కలయికపై కొడాలి నాని సెటైర్లు వేశారు. తండ్రి, కొడుకు ,పార్ట్నర్ ముగ్గురు వలస వెళ్లిన వాళ్లనని అన్నారు. ఇలాంటి వాళ్లు మొదలెట్టిన యుద్ధభేరితో సీఎం జగన్ చిటికెన వేలిని కూడా కదపలేరని టీడీపీ, జనసేన విమర్శల్ని తిప్పికొట్టారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
విజయవాడ, కృష్ణ, ఆంధ్రప్రదేశ్
డిసెంబర్ 21, 2023 3:00 PM

























