చివరిగా నవీకరించబడింది:
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు మొదలైన కొద్దిసేపటికో గందర గోళం నెలకొంది. సభలో అవినీతిపై చర్చ మొదలవడంతో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు పోటాపోటీ నినాదాల మధ్య సభ కాసేపు వాయిదా పడింది.
ఏపీ అసెంబ్లీ (Assembly)సమావేశాల్లో తొలిరోజు మొదలైన కొద్దిసేపటికో గందర గోళం నెలకొంది. సభలో చంద్రబాబు అరెస్ట్‌పై వాయిదా తీర్మానానికి టీడీపీ పట్టుబట్టింది. స్కిల్ స్కాం కేసుపై అధికార వైసీపీ (YCP)ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష టీడీపీ (TDP)సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. స్పీకర్ పోడియం వద్దకు టీడీపీ సభ్యులు చేరుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పోడియం ఎక్కి ఆందోళన చేయడంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పడంతో మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే రా అంటూ సవాల్ విసిరారు. మీసాలు తిప్పడాలు సినిమాల్లో చూపించుకోవాలంటూ బాలకృష్ణకు అంబటి చురకలంటించారు. రెండు పార్టీ ఎమ్మెల్యేల గందరగోళం మధ్య సభను కాసేపు వాయిదా వేశారు స్పీకర్.
మీసం తిప్పినందుకు స్పీకర్ వార్నింగ్…
15మంది సస్పెండ్ ..
టీడీపీకి చెందిన 13మంది శాసన సభ్యులతో పాటు మరో ఇద్దరు వైసీపీ బహిషృత ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేశారు. అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ చెప్పారు. సభలో అధికార పార్టీ వ్యవహరించిన తీరును తప్పుపట్టారు ఎమ్మెల్యే బాలకృష్ణ. అసెంబ్లీలో జరిగిన ఘటన బాధాకరమని.. నియంతృత్వధోరణిలో సభ జరిగిందన్నారు.
నియంతృత్వ పాలన..
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుంటూర్, ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 21, 2023 10:07 AM

























