బాలయ్య ఓదార్పు యాత్ర..
అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు ఒక బ్రాండ్. న్యాయ పోరాటం చేస్తాం. ఉన్న సంస్థలను జగన్ విధ్వంసం చేసి.. యువతను గంజాయికి బానిస చేశారు. ఆయన చేసే కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. జగన్‌పై ఈడీ సహా అనేక కేసులున్నాయి. బెయిల్‌పై బయట తిరుగుతున్నారంటూ బాలయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని.. న్యాయ పోరాటం చేస్తామన్నారు. జగన్ 16 నెలలు జైలులో ఉండి వచ్చారు. చంద్రబాబును 16 రోజులైనా జైలులో పెట్టాలని జగన్ కుట్ర చేస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ముందుగా గుజరాత్‌లో ప్రారంభించారు. సీఎం కేవలం పాలసీ మేకర్.. అధికారులే అమలు చేస్తారు. అజేయ కల్లం ప్రతిపాదిస్తే.. ప్రేమ్‌చంద్రారెడ్డి అమలు చేశారు. ప్రభుత్వం రూ.370 కోట్లు ఖర్చు చేసింది. 2.13 లక్షలమందికి శిక్షణ ఇచ్చారు. డిజైన్ టెక్ సంస్థకు జగన్ ప్రభుత్వం అభినందన లేఖ ఇచ్చింది. జగన్.. ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారు. ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు. తెలుగువాడి సత్తా, పౌరుషాన్ని చూపెడదాం’ అన్నారు.
జనానికి అండగా నేనున్నా..
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్, జైలుకు తరలించడం వంటి పరిణామాలను తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు తాము అండగా ఉంటామని నందమూరి బాలకృష్ణ హామీ ఇచ్చారు. చంద్రబాబు రిమాండ్‌కు తరలించడాన్ని కొందరు తట్టుకోలేక గుండెపోటుతో మరణించడం, మరికొందరు వీరాభిమానులు బలవన్మరణాలకు పాల్పడ్డారని బాలకృష్ణ అన్నారు. ఈ విషాద ఘటనలు తమ దృష్టికి వచ్చినట్లు బాలకృష్ణ తెలిపారు.
ప్రతీ కుటుంబాన్ని పరామర్శిస్తా..
చంద్రబాబు అరెస్ట్‌ని జీర్ణించుకోలేక చనిపోయిన వారికి ఆత్మకు శాంతి కలగాలని కోరిన బాలకృష్ణ కుటుంబాలకు పెద్ద దిక్కును కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. త్వరలోనే ప్రతీ కుటుంబాన్ని తాను కలవబోతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్ వంటి ఘటనలు తట్టుకోలేక మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే బాధిత కుటుంబాలకు నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆ కుటుంబాలకు తాము అండగా ఉంటామన్నారు. నేనున్నాను…మీ వద్దకు వస్తాను అని నందమూరి బాలకృష్ణ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుంటూర్, వారు గంట్, ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 13, 2023 5:32 AM
























