సభలో రసాబాస..
ఏపీ అసెంబ్లీలో
టీడీపీ నేతలు తమ పార్టీ అధ్యక్షుడు
చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై వాయిదా తీర్మానాన్ని పట్టుబట్టారు. ఆ విషయంపై
వైసీపీ నేతలు విమర్శలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. అటుపై వాయిదా తీర్మానానికి పట్టుబడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు. అంతకు ముందు బాలకృష్ణ మీసం మెలివేయడంతో మంత్రి అంబటి రాంబాబు దమ్ముంటే రా చూసుకుందామని సవాల్ చేశారు. వాయిదా తర్వాత కూడా సభలో వైసీపీ, టీడీపీ మధ్య మాటలయుద్ధం నెలకొంది. టీడీపీ నేతలు రెచ్చగొడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు.
15మంది సస్పెండ్..
అసెంబ్లీలో సభ కార్యక్రమాలకు అడ్డుతగులుతుననారని వైసీపీ బహిషృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు మరో 14 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో అనగాని సత్యప్రసాద్,
అచ్చెన్నాయుడు బాలకృష్ణ, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య, చినరాజప్ప, వెంకటరెడ్డినాయుడు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, బాలవీరాంజనేయస్వామి,వైసీపీ నుంచి గెలిచిన ఉండవల్లి శ్రీదేవి, అశోక్ ఉన్నారు.
సస్పెండ్‌ను నిరసిస్తూ..
తమను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నినాదాలు చేశారు. అదే సమయంలో అసెంబ్లీలోని మార్షల్స్‌తో వాగ్వాదానికి దిగారు టీడీపీ ఎమ్మెల్యేలు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యుడిని యూస్‍లెస్ ఫెలో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత గందరగోళం జరుగుతుండగా టీడీపీ సభ్యులు వీడియోలు తీస్తున్నారని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. మనవాళ్లు వెనక్కి రండి అంటూ వైసీపీ సభ్యులను ఉద్దేశించి స్పీకర్ వ్యాఖ్యానించడాన్ని టీడీపీ నేతలు తప్పుపట్టారు.
బీఏసీకి టీడీఎల్పీ డుమ్మా..
ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అయితే బీఏసీ సమావేశానికి టీడీఎల్పీ నేతలు హాజరు కాలేదు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
స్థానం:
గుంటూర్, ఆంధ్రప్రదేశ్
మొదట ప్రచురించబడింది:
సెప్టెంబర్ 21, 2023 11:55 AM