బీసీలకు పెద్దపీట..
టీడీపీ-జనసేన కూటమి మంగళగిరిలో జయహో బీసీ సభ నిర్వహించింది. ఈసభకు భారీ ఎత్తున బీసీ సంఘాన నాయకులు, సోదరులు హాజరయ్యారు. ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని గెలిపించాల్సిన బాధ్యత బీసీలపై ఉందన్నారు చంద్రబాబు. ఈసందర్భంగా జయహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు. బీసీలకు మేలు కలిగే 10అంశాలతో ఈ డిక్లరేషన్ ప్రకటించారు. అందులో ముఖ్యమైనది ఏపీలో 50ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి నెలకు రూ.4వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది టీడీపీ-జనసేన కూటమి.
బీసీ డిక్లరేషన్ లోని 10అంశాలు ఇవే..
1.బీసీలకు 50ఏళ్లకే పెన్షన్
2.రూ.4వేలకు పెంచుతూ నిర్ణయం
3.బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం
4.సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు
5.బీసీ బస్ ప్లాన్ తో 5ఏళ్లలో రూ.1.5 లక్షల కోట్లు కేటాయింపు
సబ్ ప్లాన్ నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు
6.స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం
7.చట్టసభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం
8.అన్నీ సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్
కొన్ని బీసీ వర్గాలకు కో ఆప్షన్ సభ్యులుగా ఛాన్స్
9.జనాభా ప్రతిపాదికన కార్పొరేషన్ల ఏర్పాటు, జనాబా దామాషా ప్రకారం నిధుల కేటాయింపు
10.బీసీల స్వయం ఉపాధికి రూ.10వేల కోట్లు, 5వేల కోట్లతో ఆదరణ పరికరాలు
టీడీపీలో చేరిన మంత్రి జయరాం..
ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేసిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే బీసీ కులాలకు పూర్తి రక్షణతో పాటు అభివృద్ది చేసి చూపిస్తామన్నారు. ఇక మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో వైసీపీ ఎమ్మెల్యే , మంత్రి గుమ్మునూరి జయరాం టీడీపీలో చేరారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. వైసీపీ స్వతంత్రం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Mangalagiri,Guntur,Andhra Pradesh
మార్చి 05, 2024 8:36 PM





















