చివరిగా నవీకరించబడింది:
AP Assembly Meetings:రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలపై చర్చించేందుకు మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. అలాగే సమావేశాల్లో పాల్గొనాలా ..? వద్దా అనే అంశాన్ని నిర్ణయించేందుకు టీడీపీ ఎెమ్మెల్యేలు సైతం ఈరోజు సమావేశం అవుతున్నాట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఓవైపు స్కిల్ స్కాం కేసులో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అరెస్టై జైల్లో ఉన్నారు. మరోపక్క గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు (Assembly Meetings)ప్రారంభం కానున్నాయి. ఈనేపధ్యంలో ఓవైపు చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమని టీడీపీ (TDP)ఆందోళనలకు చేపడుతోంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తోంది. ఇలాంటి సమయంలో ఈనెల 21నుంచి 27వ తారికు వరకు జరగబోయే శాసనసభ సమావేశాలకు హాజరవ్వాలా వద్దా ..అనే విషయంపై టీడీపీ ఎమ్మెల్యేలు రోజు నిర్ణయించనున్నారు. తమ పార్టీ అధినేత జైల్లో ఉండగా..సమావేశాలకు హాజరైతే ప్రయోజనం ఉంటుందా లేక ..సభలో చంద్రబాబు అంశంపైనే ప్రభుత్వాన్ని నిలదీస్తే బాగుంటుందా అనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేల ఆలోచన ఏ విధంగా ఉన్న వైసీపీ (YCP)ప్రభుత్వం మాత్రం నేడు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి..అందులో సమావేశాలపై చర్చ అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులపై చర్చించనుంది.
ఎవరి లెక్కలు వారివి..
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుంటూర్, ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 20, 2023 9:08 AM

























