చివరిగా నవీకరించబడింది:
పోలింగ్ కేంద్రం వద్ద ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇరువురు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ముందు వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్.. ఓటరుపై చేయి చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిలకు పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 175 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో సామాన్యులతో పాటు,రాజకీయ నాయకులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల చెదురు ముదురు ఘటనలు జరుగుతున్నాయి. ఓటర్లు, నాయకులు గొడవలకు దిగుతున్నారు.తాజాగా తెనాలి వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురయ్యింది. వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ పై ఓటరు దాడికి దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇరువురు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ముందు వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్.. ఓటరుపై చేయి చేసుకున్నారు. దీంతో ఓటరు.. ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించాడు.ఏపీ వ్యాప్తంగా 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో 4 కోట్ల 14 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే పోలింగ్ శాతం మాత్రం చాలా తక్కువగా ఉంది. 12 కావస్తున్నా.. కనీసం 30 శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు. మరోవైపు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.అన్నిప్రాంతాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసే ఛాన్సుంది. అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకల్లా పోలింగ్ ముగుస్తుంది. ఏపీలో 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు ఉన్నారు. 46 వేల 389 పోలింగ్ కేంద్రాలున్నాయి. 12 వేల 438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 34 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు
తాజాగా తెనాలి వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురయ్యింది. వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ పై ఓటరు దాడికి దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇరువురు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ముందు వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్.. ఓటరుపై చేయి చేసుకున్నారు. దీంతో ఓటరు.. ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించాడు.
ఏపీ వ్యాప్తంగా 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో 4 కోట్ల 14 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే పోలింగ్ శాతం మాత్రం చాలా తక్కువగా ఉంది. 12 కావస్తున్నా.. కనీసం 30 శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు. మరోవైపు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
అన్నిప్రాంతాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసే ఛాన్సుంది. అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకల్లా పోలింగ్ ముగుస్తుంది. ఏపీలో 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు ఉన్నారు. 46 వేల 389 పోలింగ్ కేంద్రాలున్నాయి. 12 వేల 438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 34 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
హైదరాబాద్, హైదరాబాద్, తెలంగాణ
మే 13, 2024 11:28 ఆన్

























