Homeఆంధ్రప్రదేశ్గుంటూరు జిల్లాఏపీలో ఎన్నికలకు ముందు ఆరోగ్యశ్రీ స్కీం మెడికల్ ఖర్చును 25లక్షలకు పెంచిన వైఎస్ జగన్ |YS...

ఏపీలో ఎన్నికలకు ముందు ఆరోగ్యశ్రీ స్కీం మెడికల్ ఖర్చును 25లక్షలకు పెంచిన వైఎస్ జగన్ |YS Jagan increased the medical cost of Arogyashri scheme to 25 lakhs before the election in AP

చివరిగా నవీకరించబడింది:

Arogyasri:ఏపీ ప్రభుత్వం ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది. పెన్షన్ పెంపు, ఆరోగ్యశ్రీ వైద్యఖర్చులను పాతిక లక్షలు చేయడం వంటి ప్రకటించడం వెనుక అసలు కారణం ఇదేనని రాజకీయ పార్టీలు చెవులు కొరుక్కుంటున్నాయి.

AROGYASRIAROGYASRI
AROGYASRI

తెలంగాణ(Telangana)లో, ఆంధ్రా(Andhra)లో అసెంబ్లీ ఎన్నికలు ఒకటే అయినా ..ఏపీలోని రాజకీయ పార్టీలకు మాత్రం తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఓ మాక్ డ్రిల్ లా చూస్తున్నాయి.త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే ఊహాగానాలకు చెక్ పెడుతూనే ఆధికార వైసీపీ(YCP) మార్చి చివరలో జరుగబోయే ఎన్నికల వల్ల విద్యార్థులు అసౌకర్యం కలగకూడని ఇంటర్ ,టెన్త్ పరీక్షలను మార్చి మొదటివారంలోనే నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి చెప్పటంతో ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఆ స్టేట్ మెంట్ మాత్రమే కాదు శుక్రవారం(Friday) జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో కూడా సీఎం జగన్(YS Jagan) ఫిబ్రవరిలోనే ఎన్నికలు ఉంటాయని..ఈలోపే ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పడంతో రాజకీయ పార్టీల్లో పొలిటికల్ సెగ రాజేసినట్లైంది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జగన్ మరో అస్త్రాన్ని వదిలారు. అదే ఆరోగ్యశ్రీ. ఇప్పుడు కొత్తగా ఆరోగ్యశ్రీ (AROGYASREE)పథకంలో 25 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయాలను అందించాలని ఈ సౌకార్యాన్ని అందరి కోసం పెంచినట్లుగా ప్రకటించారు.ఈ టైంలో ఆరోగ్యశ్రీ పథకం వైద్యసదుపాయల ఖర్చును పెంచడంపై రాజకీయా పార్టీలు మాత్రం ఎన్నికల లబ్ది కోసమే చేస్తున్నారని విమర్శిస్తున్నారు.వైసీపీ ఎన్నికల అస్త్రం..ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై ఇప్పటి నుంచే పార్టీలో అంచనా వేయలేకపోతున్నాయి. అందుకే అధికార వైసీపీ మాత్రం మరోసారి అధికారంలోకి రావడం కోసం ప్రజలను తమవైపు తిప్పుకోవడం కోసం అత్యంత గుర్తింపు తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యఖర్చులను పాతిక లక్షలకు పెంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది.పేద ప్రజల ఆరోగ్యమే తనకు ముఖ్యమని అందుకే ప్రజలకు మేలు చేయాలనీ ఆరోగ్య శ్రీ పథకం లో 25 లక్షల వరకు ఉచిత వైద్య్సదుపాయాలను అందించాలని ఈ సోకార్యాన్ని మీ అందరి కోసం పెంచుతున్నట్లు తెలిపారు జగన్.

వైసీపీ ఎన్నికల అస్త్రం..

ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై ఇప్పటి నుంచే పార్టీలో అంచనా వేయలేకపోతున్నాయి. అందుకే అధికార వైసీపీ మాత్రం మరోసారి అధికారంలోకి రావడం కోసం ప్రజలను తమవైపు తిప్పుకోవడం కోసం అత్యంత గుర్తింపు తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యఖర్చులను పాతిక లక్షలకు పెంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది.పేద ప్రజల ఆరోగ్యమే తనకు ముఖ్యమని అందుకే ప్రజలకు మేలు చేయాలనీ ఆరోగ్య శ్రీ పథకం లో 25 లక్షల వరకు ఉచిత వైద్య్సదుపాయాలను అందించాలని ఈ సోకార్యాన్ని మీ అందరి కోసం పెంచుతున్నట్లు తెలిపారు జగన్.

గెలుపు కోసమే 25లక్షల పథకం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత సీఎం రాజశేఖర రెడ్డి రెండోసారి ప్రభుత్వం ఏర్పాటులో ఆరోగ్య శ్రీ పథకం ఎంతో మేలు చేసింది . అందుకే జగన్ కూడా ఇప్పుడు తన తండ్రి పంథాలోనే ఆరోగ్య శ్రీ వైద్య ఖర్చులను 25లక్షల కు పెంచారు. దీంతో పాటుగా జగన్ కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే అన్ని నియోజిక వర్గాల వారిగా సర్వే రిపోర్టుల ప్రకారమే అభ్యర్థులను నిర్ణయిస్తున్నట్లుగా తెలుస్తోంది.అందులో భాగంగానే కొన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జులను మార్చడానికి కారణంగా కనిపిస్తోంది.

సెంటిమెంట్ వర్కవుట్ ఫాలో అవుతున్నారా..

అధికార వైసీపీ సంక్షేమ పథకాలతో ప్రజల్ని ఆకర్షిస్తుంటే ..ప్రతిపక్ష టీడీపీ కూడా తగ్గేదేలే అంటోంది. స్కిల్ స్కాం కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు 50రోజులకుపైగా జైల్లో ఉన్నారు. విడుదలైన 20రోజులకు ప్రజల్లోకి వచ్చారు. తాజాగా పత్రికా సమావేసం ఏర్పాటు చేసి మరీ ప్రజలకు నచ్చిన వారినే టీడీపీ అభ్యర్ధులుగా ఖరారు చేస్తుందని ప్రకటించారు. అంటే ప్రజలు చెప్పిన వారికే టికెట్ కేటాయిస్తామని చెప్పడంతో పాటు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు విభిన్న కోణాల్లో ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే అభ్యర్థుల ఎంపిక చేస్తామనడంతో ఎన్నికల యుద్ధం మొదలైంది.

ప్రజామోదం పేరుతో టీడీపీ ప్రచారం..

ఈసారి జరగబోయే ఎన్నికలు సైకో జగన్ కు 5కోట్ల ప్రజలకు మధ్య జరిగే సమరం అని వైసీపీ అభ్యర్థులకు తాడేపల్లి ప్యాలెస్ ఆమోదిస్తే తమ పార్టీ మాత్రం ప్రజా ఆమోదం పొందిన వారికే టికెట్ లు ఇచ్చి ఈ సారి ఎన్నికలకు వెళ్తామన్నారు. ఇక ఈసారి జనసేనతో పొత్తుపెట్టుకున్న టీడీపీ పొత్తు పెట్టుకున్న పార్టీలతో చర్చించి ఏకాభిప్రాయంతోనే ముందుకెళ్తామన్నారు.జగన్ అహంకారం వల్ల తెలుగు ప్రజలు ఎంతగానో నష్టపోయారని ..మరో 3నెలల్లో జగన్ ఇంటికి పోవడం ఖాయమని చెప్పారు. అయితే టీడీపీని గెలిపించేందుకు చంద్రబాబు ప్రజా ఆమోదంతో పాటు అధికార పార్టీపై విమర్శలతో ఈసారి గట్టెక్కాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Extramarital Affair: భర్తకు బిర్యానీ పెట్టి.. బెడ్రూంలో బాయ్‌ఫ్రెండ్‌తో అరాచకం.. నైట్ అంతా అదే పని | ట్రెండింగ్

0
చివరిగా నవీకరించబడింది:జనవరి 22, 2026 3:16 PM ISTExtramarital Affair: వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తతో కలిసి 15ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఆ వివాహితకు మరో వ్యక్తితో పరిచయం భర్తను...

CMAT అడ్మిట్ కార్డ్ 2026 cmat.nta.nic.inలో విడుదల చేయబడింది, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

CTET పరీక్ష సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇంటిమేషన్ స్లిప్ త్వరలో ctet.nic.inలో...

నవీకరించబడింది: జనవరి 22, 2026 9:46:33 AM ISTCTET పరీక్ష సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇంటిమేషన్ స్లిప్ త్వరలో ctet.nic.inలో విడుదల కానుందిCTET పరీక్ష సిటీ...

CUET PG 2026: రిజిస్ట్రేషన్ తేదీ జనవరి 23 వరకు పొడిగించబడింది, ఇక్కడ నోటీసును తనిఖీ చేయండి

CUET PG 2026 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగించబడింది. అధికారిక ప్రకటనను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. Source link

JEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష...

నవీకరించబడింది: జనవరి 21, 2026 9:17:54 AM ISTJEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష రోజు సూచనలను తనిఖీ చేయండిJEE...

error: Content is protected !!