చివరిగా నవీకరించబడింది:
ఈ ఘటనపై వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌పై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
ఏపీలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అయితే ఏపీలో గుంటూరు జిల్లా తెనాలిలో మాత్రం వైసీపీ ఎమ్మెల్యే దాడి ఘటనపై ఈసీ సీరియస్ అయ్యింది. క్యూలైన్లో వస్తున్న ఓటరుపై ఎమ్మెల్యే శివకుమార్ దాడికి దిగారు.ఓటరును చెంపదెబ్బ కొట్టడం వైసీపీ తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ స్పందించారు. సుధాకర్ అనే వ్యక్తి తన గురించి అసభ్యంగా మాట్టాడారని ఆయన అన్నారు. ఎస్సీలు, మైనార్టీలకు అంటకాగేవాడు వచ్చాడని విమర్శలు చేశాడన్నారు. అతడు తాగొచ్చి గొడవ చేస్తున్నాడంటూ ఓటర్లు కూడా చెప్పారన్నారు. అందుకే కోపం వచ్చి అతడ్ని కొట్టానన్నారు. అయితే పోలింగ్ పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే శివకుమార్ హౌస్ అరెస్టులో ఉండాలని.. ఈసీ ఆదేశాలు జారీ చేసింది.మరోవైపు ఈ ఘటనపై వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌పై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పోలింగ్ పూర్తయ్యే వరకు శివకుమార్‌ను హౌస్ అరెస్ట్ చేయాలని పేర్కొంది.పోలింగ్ కేంద్రంలో శివకుమార్ క్యూలైన్‌లో వెళ్లకుండా నేరుగా వెళ్లడంపై ఓటరు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన శివకుమార్.. ఓటరు చెంపపై కొట్టారు. వెంటనే ప్రతిఘటించిన ఓటరు.. ఎమ్మెల్యే చెంప కూడా చెళ్లుమనిపించారు. అనంతరం శివకుమార్ అనుచరులు ఓటరుపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ ఘటన ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకుంది.
ఓటరును చెంపదెబ్బ కొట్టడం వైసీపీ తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ స్పందించారు. సుధాకర్ అనే వ్యక్తి తన గురించి అసభ్యంగా మాట్టాడారని ఆయన అన్నారు. ఎస్సీలు, మైనార్టీలకు అంటకాగేవాడు వచ్చాడని విమర్శలు చేశాడన్నారు. అతడు తాగొచ్చి గొడవ చేస్తున్నాడంటూ ఓటర్లు కూడా చెప్పారన్నారు. అందుకే కోపం వచ్చి అతడ్ని కొట్టానన్నారు. అయితే పోలింగ్ పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే శివకుమార్ హౌస్ అరెస్టులో ఉండాలని.. ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ఈ ఘటనపై వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌పై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పోలింగ్ పూర్తయ్యే వరకు శివకుమార్‌ను హౌస్ అరెస్ట్ చేయాలని పేర్కొంది.
పోలింగ్ కేంద్రంలో శివకుమార్ క్యూలైన్‌లో వెళ్లకుండా నేరుగా వెళ్లడంపై ఓటరు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన శివకుమార్.. ఓటరు చెంపపై కొట్టారు. వెంటనే ప్రతిఘటించిన ఓటరు.. ఎమ్మెల్యే చెంప కూడా చెళ్లుమనిపించారు. అనంతరం శివకుమార్ అనుచరులు ఓటరుపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ ఘటన ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుంటూర్, ఆంధ్రప్రదేశ్

























