చివరిగా నవీకరించబడింది:
ఈ మంత్రి సక్సెస్ కి మారుపేరని చెప్పవచ్చు. ఇంతకు ఈయన సాధించిన ఘనత ఏమిటో తెలుసుకుందాం.
జస్ట్ ఫర్ చేంజ్ అనే డైలాగ్ ఎంత ఫేమస్ తెలిసిందేగా. అదే రీతిలో ఏపీలో ఓ మంత్రి జస్ట్ ఫర్ చేంజ్ అంటూ తన జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పును సాధించారు. ప్రజాస్వామ్య దేశంలో ఏదైనా సాధ్యమే అంటూ నిరూపించారు ఈ మంత్రి. పట్టుదల కృషి ఉంటే చాలు ఏ రంగంలోనైనా సరే విజయాన్ని అందుకోవచ్చని ఈయన ప్రపంచానికి చాటిచెప్పారు. ఇంతకు ఆ మంత్రి ఎవరో కాదు ఏపీలోని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి.2007లో కొండేపి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా డాక్టర్ డోలాబాల వీరాంజనేయ స్వామి విధులు నిర్వర్తించారు. ఈయన నాటి రోజుల్లో ప్రజా వైద్యుడిగా నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతులు సైతం సాధించారు. రోగుల పాలిట దైవంగా మారిన ఈయన 2007లో ఒంగోలులో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఉత్తమ డాక్టర్ గా నాటి కలెక్టర్ దేవానంద్ ద్వారా అవార్డును అందుకున్నారు. అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు డాక్టర్ స్వామి.కొండేపి నియోజకవర్గం నుండి తొలిసారిగా 2009లో ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన ఈయన ఓటమి చవిచూశారు. ఇక తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న డోలా బాల వీరాంజనేయ స్వామి, 2019, 2024 లో వరుస విజయాలతో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు.వరుసగా హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా నియమించారు. దీనితో ఈయన ప్రకాశం జిల్లాకు చెందిన ఏకైక మంత్రి గా ఉన్నారు.కాగా ఒంగోలులో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మంత్రిగా స్వామి పాల్గొన్నారు. జెండా వందనం చేసి ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగానే గతంలో ప్రభుత్వ వైద్యుడిగా ఉత్తమ అవార్డును అందుకున్న సందర్భాన్ని మంత్రి స్వామి ఒక్కసారిగా జ్ఞప్తికి తెచ్చుకున్నారు. 2007లో డాక్టర్ గా ప్రశంసా పత్రం అందుకున్న మంత్రి స్వామి, నేడు 368 మందికి ప్రశంసా పత్రాలను మంత్రి హోదాలో అందజేశారు. అంటే ఇదే అన్నమాట జస్ట్ ఫర్ చేంజ్. నాడు అధికారిగా అవార్డును అందుకున్నారు. నేడు ప్రజల పక్షాన మంత్రిగా ఉంటూ ఉత్తమ సేవలు అందించిన అధికారులకు అవార్డులను అందజేశారు.
2007లో కొండేపి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా డాక్టర్ డోలాబాల వీరాంజనేయ స్వామి విధులు నిర్వర్తించారు. ఈయన నాటి రోజుల్లో ప్రజా వైద్యుడిగా నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతులు సైతం సాధించారు. రోగుల పాలిట దైవంగా మారిన ఈయన 2007లో ఒంగోలులో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఉత్తమ డాక్టర్ గా నాటి కలెక్టర్ దేవానంద్ ద్వారా అవార్డును అందుకున్నారు. అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు డాక్టర్ స్వామి.
కొండేపి నియోజకవర్గం నుండి తొలిసారిగా 2009లో ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన ఈయన ఓటమి చవిచూశారు. ఇక తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న డోలా బాల వీరాంజనేయ స్వామి, 2019, 2024 లో వరుస విజయాలతో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు.
వరుసగా హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా నియమించారు. దీనితో ఈయన ప్రకాశం జిల్లాకు చెందిన ఏకైక మంత్రి గా ఉన్నారు.
కాగా ఒంగోలులో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మంత్రిగా స్వామి పాల్గొన్నారు. జెండా వందనం చేసి ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగానే గతంలో ప్రభుత్వ వైద్యుడిగా ఉత్తమ అవార్డును అందుకున్న సందర్భాన్ని మంత్రి స్వామి ఒక్కసారిగా జ్ఞప్తికి తెచ్చుకున్నారు. 2007లో డాక్టర్ గా ప్రశంసా పత్రం అందుకున్న మంత్రి స్వామి, నేడు 368 మందికి ప్రశంసా పత్రాలను మంత్రి హోదాలో అందజేశారు. అంటే ఇదే అన్నమాట జస్ట్ ఫర్ చేంజ్. నాడు అధికారిగా అవార్డును అందుకున్నారు. నేడు ప్రజల పక్షాన మంత్రిగా ఉంటూ ఉత్తమ సేవలు అందించిన అధికారులకు అవార్డులను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
ప్రకృతి, ప్రకృతి, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ గుంతూరు, ఆంధ్రప్రదేశ్ గుంతూరు
ఆగస్టు 16, 2024 11:49 AM

























