చివరిగా నవీకరించబడింది:
Viral News: ఈ జనరేషన్ లో కూడా స్టూడెంట్స్ బ్లాక్ మెయిల్ చేయడం, తాంత్రిక పూజల పేరుతో భయపెట్టే సంస్కృతిని విడిచిపెట్టకపోవడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. బాపట్ల జిల్లాలో అలాంటి సంఘటనే చోటుచేసుకోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది.
గతంలో పరీక్షలు రాసే విద్యార్దులు మార్కులు, ర్యాంకులనే టార్గెట్ గా పెట్టుకునే వారు. ఎగ్జామ్స్ (Exams)లో పాసైతే నెక్స్ట్ ఏంటీ .. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఏ స్టేట్ వెళితే బాగుంటుంది.. ఏ కోర్సు మంచి జాబ్ వస్తుందనే ఆలోచనలపై ఫోకస్ పెడుతున్నారు. కాని ఈ జనరేషన్ లో కూడా స్టూడెంట్స్ బ్లాక్ మెయిల్ ( Blackmailed)చేయడం, తాంత్రిక పూజల పేరుతో భయపెట్టే సంస్కృతిని విడిచిపెట్టకపోవడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. బాపట్ల జిల్లాలో అలాంటి సంఘటనే చోటుచేసుకోవడంతో ఇప్పుడు సోషల్ మీడియా(Social Media)లో ఈ వార్త వైరల్ అవుతోంది. బాపట్ల(Bapatla) పురపాలక ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్ష పేపర్లు దిద్దేందుకు వచ్చిన ఓ టీచర్ తనకు వచ్చిన వాల్యువేషన్ పేపర్లో ఓ స్టూడెంట్ రాసిన పదాలు చూసి షాక్ అయ్యాడు. తనకు మంచి మార్కులు వేయకపోతే మా తాతయ్యతో చెప్పి చేతబడి చేయిస్తానంటూ ఆన్సర్ షీట్ లో రాశాడు. ఇది చూసిన సదరు టీచర్ జవాబు పత్రాన్ని ఉన్నతాధికారులకు చూపించారు.చేతబడి చేస్తానని బ్లాక్ మెయిల్పరీక్షలు అంటే గతంలో కాపీ కొట్టి పాసైన వారిని చూశాం. లేదంటే చిట్టీలు రాస్తూ పట్టుబడిన వాళ్లను చూశాం. కాని ఇలా చేస్తే ఎక్కడ దొరికిపోతాము అనుకున్నాడో ఏమో ఓ స్టూడెంట్ పదవ తరగతి ఆన్సర్ షీట్ లో తెలుగు సబ్జెక్ట్ లో ఇచ్చిన ప్రశ్న రామాయణ ప్రాశస్త్యం గురించి వివరించమంటే .. తనకు మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తానంటూ పేపర్ వాల్యువేషన్ కు వచ్చిన టీచర్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ పేపర్ లో రాశాడు. ఈఘటన బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్ష పేపర్లు దిద్దేందుకు వచ్చిన ఓ టీచర్ గుర్తించి అధికారులకు చూపించడంతో వార్త వైరల్ అవుతోంది.
చేతబడి చేస్తానని బ్లాక్ మెయిల్
పరీక్షలు అంటే గతంలో కాపీ కొట్టి పాసైన వారిని చూశాం. లేదంటే చిట్టీలు రాస్తూ పట్టుబడిన వాళ్లను చూశాం. కాని ఇలా చేస్తే ఎక్కడ దొరికిపోతాము అనుకున్నాడో ఏమో ఓ స్టూడెంట్ పదవ తరగతి ఆన్సర్ షీట్ లో తెలుగు సబ్జెక్ట్ లో ఇచ్చిన ప్రశ్న రామాయణ ప్రాశస్త్యం గురించి వివరించమంటే .. తనకు మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తానంటూ పేపర్ వాల్యువేషన్ కు వచ్చిన టీచర్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ పేపర్ లో రాశాడు. ఈఘటన బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్ష పేపర్లు దిద్దేందుకు వచ్చిన ఓ టీచర్ గుర్తించి అధికారులకు చూపించడంతో వార్త వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వార్త..
తెలుగు పరీక్ష రాసిన స్టూడెంట్ మార్కులు వేయకపోతే మా తాతయ్యతో చెప్పి చేతబడి చేయిస్తానంటూ ఆన్సర్ షీట్ లో రాశాడు. అయితే విచిత్రం ఏమిటంటే ఈవిధంగా టీచర్ ను భయపెట్టి మార్కులు సంపాదించవచ్చని భావించిన స్టూడెంట్ కి యదార్ధంగా 70 మార్కులు వచ్చాయి.
—- పోల్స్ మాడ్యూల్ ఇక్కడ ప్రదర్శించబడుతుంది —-
షాక్ లో ఉన్న టీచర్..
జవాబు పత్రంలో సమాధానాలు తప్ప వేరే రాయకూడదనే నిబంధనలతో పాటు చేతబడి చేయిస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన విద్యార్ధి హాల్ టికెట్ ఆధారంగా పేరు, వివరాలు సేకరించారు. అయితే అతని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బయటపెట్టలేదు. ఆ స్టూడెంట్ పై చర్యలు తీసుకుంటారా లేక పాస్ చేస్తారా అనే సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Bapatla,Guntur,Andhra Pradesh
ఏప్రిల్ 10, 2024 2:03 PM

























