హైదరాబాద్: జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుండి హైదరాబాద్‌కు బయలుదేరిన లుఫ్తాన్సా విమానం (LH752) బాంబు బెదిరింపు రావడంతో వెనక్కి మళ్లి, తిరిగి జర్మనీకి చేరుకుంది. ఈ ఘటనపై విచారణ చేపట్టడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు.
























