ఈ సంధర్భంగా లోకేష్ సతీమణి బ్రాహ్మణి స్పందిస్తూ.. అంతా పల్లెల్లో నుండి అమెరికా వెళితే, అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి, సిమెంట్ రోడ్లతో, ఎల్ఇడి వెలుగులతో వాటి రూపురేఖలు మార్చేశారు. పనిలో పడి విమర్శలను పట్టించుకోకుండా అవార్డుల పంట పండించారు.మీ వ్యక్తిత్వహననం చేసిన వారు అవాక్కయ్యేలా వాళ్ళకు మీరేంటో తెలియజేశారు. సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకొన్నారు. మీ సమర్ధతతో నేటితరం, భావితరం భాగ్యరేఖలు మీరు మార్చగలవనే నమ్మకం మాకుంది. కుటుంబపరంగా ఎల్లవేళలా మీకు మా సహకారం ఉంటుంది. కంగ్రాట్స్ డియర్ అంటూ ట్వీట్ చేశారు.

























