“బహుశా, వారు నన్ను అరెస్టు చేయవచ్చు. కానీ, ఒక విషయం మాత్రం ఖాయం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేం గతంలో జైలుకు వెళ్ళాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రోత్సహించడానికి తీసుకున్న నిర్ణయంపై మళ్ళీ జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. వందసార్లు జైలుకు వెళ్ళడానికైనా సిద్ధం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దాని ఎన్నికల హామీల విషయంలో వదిలిపెట్టం” అని కేటీఆర్ అన్నారు. చివరికి సత్యమే గెలుస్తుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు.
























