ఇందులో 33 మిలియన్ కేజీల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్టు అధికారులు వివరించారు. మరో 20 మిలియన్ కేజీల మేర పొగాకును ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు చేసినట్టు సీఎంకు అధికారులు తెలిపారు. బాపట్ల -3, గుంటూరు–2, పలనాడు -1, ప్రకాశం – 1 కొనుగోలు కేంద్రాలు ద్వారా పొగాకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని.. వీటి ద్వారా రేపటి నుంచే కొనుగోళ్లు ముమ్మరం చేస్తామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కొనుగోళ్ల కేంద్రాల వివరాలను, సంబంధిత సమాచారాన్ని ప్రతీ పొగాకు రైతుకు అందివ్వాలని సీఎం ఆదేశించారు.





















