రేపు ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు

రేపు కాకినాడ (3), కోనసీమ (7), తూర్పు గోదావరి గోకవరం మండలాల్లో తీవ్రవడగాలులు (11), మరో 98 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
అలాగే రేపు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఆదివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.8°C, వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట, పల్నాడు జిల్లా రావిపాడులో 41.4°C అధిక ఉష్ణోగ్రతలు, 54 మండలాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు తెలిపారు.
సాయంత్రం 6 గంటల నాటికి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 54.7మిమీ, ప్రకాశం కనిగిరిలో 43మిమీ, అల్లూరి జిల్లా బుట్టాయిగూడెంలో 39.5మిమీ వర్షపాతం నమోదైందన్నారు.
భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
వడగాలులు వీచే మండలాల వివరాలు:
























