Homeఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లాజాబ్ ట్రాన్స్ఫర్ కావాలా…. ఒక్కసారి ఈ ఆలయానికి వెళ్లివస్తే చాలు|do you need job transfer...

జాబ్ ట్రాన్స్ఫర్ కావాలా…. ఒక్కసారి ఈ ఆలయానికి వెళ్లివస్తే చాలు|do you need job transfer just visit this temple in palnadu district

చివరిగా నవీకరించబడింది:

Temple: ఇప్పటి వరకు ఎక్కడా లేనటువంటి విశిష్టత కలిగిన ఆలయం ఒకటి పల్నాడు జిల్లాలో ఉంది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే .. ఆ పనిలో ఇట్టే అయిపోతుందని భక్తుల విశ్వాసం.

ఆలయంఆలయం
ఆలయం

భగవంతుడిపై భక్తులు పెట్టుకునే విశ్వాసం అపారమైనది. కోరిన కోర్కెలు తీర్చమనే భక్తులు కొందరుంటే .. సాధారణ అవసరాలు తీర్చమని దేవుడ్ని ప్రార్ధించే వారు మరికొందరు ఉంటారు. అందుకే మనకు తెలిసి చాలా విశిష్టత, మహిమాన్విత శక్తి కలిగిన ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాన్ని సందర్శిస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని..దేవతామూర్తిని పూజిస్తే ఆర్ధిక ఇబ్బందులుండవనే విధంగా చాలా ఆలయాలు ప్రాచూర్యం పొందినవి. అయితే ఇప్పటి వరకు ఎక్కడా లేనటువంటి విశిష్టత కలిగిన ఆలయం ఒకటి పల్నాడు(Palnadu) జిల్లాలో ఉంది. ఈ పురాతన ఆలయంలో వెలసిన స్వామిని పరమేశ్వరుడని పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. అంతే కాదు శ్రీ కపోతేశ్వర స్వామిగా కూడా కొలుస్తారు. పిలుస్తారు. ఈ ఆలయ(Temple) ప్రత్యేకత ఏమిటంటే ఉద్యోగులు బదిలీ కోసం(ట్రాన్స్ఫర్) కోసం ఎదురుచూస్తుంటే ఈ పురాతన ఆలయాన్ని దర్శించుకుంటే వెంటనే ట్రాన్స్ఫర్ (Transfer )ఆర్డర్(Order)వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అసలు ఇంతటి విశిష్టత కలిగిన ఆలయం ఎక్కడుంది..దాని స్తల పురాణం, ప్రత్యేకతలు తెలుసుకోవాలంటే ఒక్కసారి ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.ట్రాన్స్ఫర్ కావాలంటే ఈ టెంపుల్ కి వెళ్లాల్సిందే..మానవ ప్రయత్నం చేసిన తర్వాత సాధ్యం కానిది ఏదైనా ఉంటే అప్పుడు భగవంతుడిపై భారం వేయడం భక్తుల అలవాటు. ఇది ఆర్ధిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు. లేక మానసిక రుగ్మతలు కావచ్చు. సమస్య ఏదైనా మనిషి వల్ల సాధ్యం కాని పక్షంలో దేవుడ్ని ఆశ్రయించడం చాలా మంది చేసే పని. కాని పల్నాడు జిల్లా చేజర్లలో ఓ పురాతన ఆలయం ఉంది. ఇది మహా భారతం నాటి ఆలయంగా పురాణ ఇతిహాసలు చెప్తున్నాయి. ఈ ఆలయంలో మూలమూర్తిగా వెలసిన స్వామిని శ్రీ కపోతేశ్వర స్వామిగా ప్రతితి.ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా ఉద్యోగులు ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసి ఇంకా ఆర్డర్ కాపీ రాకపోతే ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ కొలువైన శివయ్య వారి బదిలీ అయ్యే విధంగా ఆశీర్వదిస్తాడని నమ్మకం.

ట్రాన్స్ఫర్ కావాలంటే ఈ టెంపుల్ కి వెళ్లాల్సిందే..

మానవ ప్రయత్నం చేసిన తర్వాత సాధ్యం కానిది ఏదైనా ఉంటే అప్పుడు భగవంతుడిపై భారం వేయడం భక్తుల అలవాటు. ఇది ఆర్ధిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు. లేక మానసిక రుగ్మతలు కావచ్చు. సమస్య ఏదైనా మనిషి వల్ల సాధ్యం కాని పక్షంలో దేవుడ్ని ఆశ్రయించడం చాలా మంది చేసే పని. కాని పల్నాడు జిల్లా చేజర్లలో ఓ పురాతన ఆలయం ఉంది. ఇది మహా భారతం నాటి ఆలయంగా పురాణ ఇతిహాసలు చెప్తున్నాయి. ఈ ఆలయంలో మూలమూర్తిగా వెలసిన స్వామిని శ్రీ కపోతేశ్వర స్వామిగా ప్రతితి.ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా ఉద్యోగులు ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసి ఇంకా ఆర్డర్ కాపీ రాకపోతే ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ కొలువైన శివయ్య వారి బదిలీ అయ్యే విధంగా ఆశీర్వదిస్తాడని నమ్మకం.

పురాణాల్లో ఉన్న నానుడి..

ఈ ఆలయానికి ఇది ప్రత్యేకత అయితే పురాణ చరిత్ర కూడా ఉంది.శిబి చక్రవర్తికి ఇద్దరు సోదరులు ఉన్నారు. వారిలో ఒకరు మేఘదాంబరుడు కాగా రెండవ వాడు జీమూత వాహనుడు. కాష్మీర్ 1500 మంది పరివారం వెంటబెట్టుకొని దేశం విడచి తీర్ధయాత్రలకు మేఘదాంబరుడు అన్న అనుమతి తీసుకున్నారు. అక్కడకు వెళ్లి కొండపై యోగులతో కలసి తపస్సు ఆచరించాడు. కొండపై అతని శరీరం దహనం చేయగా ఆ భస్మం ఒక లింగరూపం ధరించింది. అన్న తిరిగి రానందున అతనిని వెదుకుతూ జీమూతవాహనుడు అనుచరులను వెంటబెట్టుకొని ఆ కొండవద్దకు వచ్చాడు. అన్నకు జరిగిన విషయం తెలుసుకుని ఆకొండపైనే తపమాచరించి తానూ మరణించాడు.

శిబి చక్రవర్తికి పరీక్ష..

ఇద్దరు తమ్ముళ్లను వెతుకుంటూ శిబి చక్రవర్తి స్వయంగా అక్కడికి వచ్చి రెండు లింగాలను చూశాడు. అక్కడ వంద యజ్ఞాలు చేయాలనుకున్నాడు. 100 యాగం చేస్తుండగా దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మారు వేషంలో వచ్చి అతనిని పరీక్షించారు. మహేశ్వరుడు వేటగాడిగా, విశువు కపోతంగా, బ్రహ్మ విల్లుగా మారి మారు వేషంలో చక్రవర్తి వద్దకి చేరుకున్నారు. త్రిమూర్తులు తమ రూపాలను మార్చుకున్న ప్రదేశం రూపెమగుంట్ల గ్రామంగా త్రిమూర్తులు శిబిచక్రవర్తిని క్రీగంట చూసిన ప్రదేశాన్ని కండ్లగుంట గ్రామంగాను ప్రాచుర్యం పొందాయి. ఈ మూడు గ్రామాలు చేజర్లకు సమీపంలో ఉన్నాయి. వేటగాడు భయానికి శిబి చక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరింది. ఎలాంటి అపాయం రాకుండా చూసుకుంటానని కపోతానికి చెప్పారట.

మాటకు కట్టుబడినందుకు..

వేటగాడు వచ్చి పావురమే మా ఆహారం అది ఇవ్వకుంటే తమ కుటుంబం ఆకలితో అలమటించాలని చెప్పారు. దీంతో శిబి సంశయంలో పడిపోయాడు. చివరకు పావురం బరువు ఉన్న మాంసం ఇస్తానని చెప్పి వేటగానిని ఒప్పించాడు. ఓ త్రాసులో ఓవైపు పావురాన్ని ఒక వైపు ఉంచి, తన కొంత మాంసాన్ని రెండవవైపు ఉంచాడు. అయినా అవి సరి తూగవు. చివరకు తన తల నరికి ఆ త్రాసులో పెట్టాడు. అతని త్యాగ శీలతకు మెచ్చి దేవతలు అతనిని పునరుజ్జీవితుడిని చేసి వరం కోరుకోమన్నారు. తనకు, తన పరివారానికి కైలాస ప్రాప్తిని కోరుకుంటాడు. పరివార సమేతంగా తమందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరాడు. అలా తల లేని శిబి మొండెమే కపోతేశ్వర లింగమైందని స్థల పురాణం చెప్తుంది. అప్పటి నుంచి ఇక్కడ బదిలీలు కోర్కెలు ఉండే ఉద్యోగులు స్వామి వారిని సేవిస్తే ట్రాన్స్ఫర్ లు అవుతాయని చెప్తున్నారు.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

TANCET, CEETA PG 2026: Tancet.annauniv.eduలో మార్చి 16న రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, పరీక్ష మేలో జరుగుతుంది

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

NEET UG 2026: NTA NEET కోసం ఈరోజు neet.nta.nic.inలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ, ఎలా నమోదు...

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

Vijayawada: విజయవాడ, గుంటూరు వాసులకు గుడ్ న్యూస్.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఇంటికి సరుకులు!...

0
చివరిగా నవీకరించబడింది:మార్చి 11, 2026 7:02 AM ISTమారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు నిత్యావసర వస్తువులను అత్యంత వేగంగా, అంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేయడమే లక్ష్యంగా ఈ క్విక్ కామర్స్...

WBJEE 2026: wbjeeb.nic.inలో పశ్చిమ బెంగాల్ JEE కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యక్ష లింక్

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

SSC పరీక్షలు 2026: CHSL టైర్ 2, JE పేపర్ 2 పరీక్ష తేదీలు ssc.gov.inలో ముగిశాయి, ఇక్కడ...

error: Content is protected !!