చివరిగా నవీకరించబడింది:
నల్లగొండ జిల్లాకు చెందిన మేడి నాగరాజు పీజీ, పీహెచ్‌డీ చదివి ఉద్యోగం రాక టీ వ్యాపారం ప్రారంభించి నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు. 10 రకాల టీలు అందిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
పీజీలు, పీహెచ్‌డీలు చదివి ఉద్యోగం రాక కొందరు యువత నిరాశలోకి జారుకుంటారు. కానీ నల్లగొండ జిల్లాకు చెందిన మేడి నాగరాజు మాత్రం ఆ పరిస్థితిని సవాల్‌గా తీసుకొని, ఒక చిన్న టీ వ్యాపారాన్ని ప్రారంభించి, నెలకు లక్ష రూపాయలు ఆదాయం సంపాదిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా అతన్ని లోకల్ 18 ఛానల్ పలకరించగా, పూర్తి వివరాలు చెప్పారు. నల్లగొండ జిల్లాలోని టూ టౌన్‌కి ఎదురుగా 10 సంవత్సరాల నుండి గ్రీన్ టీ, లెమన్ టీ, ఆయుర్వేదిక్ సంబంధించిన టీలన్నీ ప్రజలకు ఉపయోగపడేవి అనే ఆలోచనతో ఈ వ్యాపార రంగంలో రాణించాలని అనుకున్నాను.
“రోజూ దాదాపు 500 కస్టమర్లు వస్తుంటారు. ఉదయం ఎల్జీ కళాశాలకు వాకింగ్‌కి చుట్టుపక్కల కాలనీ వాళ్లు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో వారికి నచ్చిన టీ, కాఫీ, లెమన్ టీ తాగి వెళ్తుంటారు. మా దగ్గర గ్రీన్ టీ, లెమన్ టీ, కరివేపాకు టీ, దాచిన చెక్కతో టీ ఇలా దాదాపు పది రకాల టీలు అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా లెమన్ టీ, గ్రీన్ టీ తాగుతుంటారు. ఇది తాగిన వారు ఒబేసిటీ, చెడు కొలెస్ట్రాల్ లాంటి ఆరోగ్య సమస్యలు దూరమయ్యాయని స్వయంగా గత నాలుగు సంవత్సరాలు తాగుతున్న కస్టమర్లు మాతో తెలియజేశారు” అని అన్నారు.
తానే స్వయంగా గ్రీన్ టీ, లెమన్ టీ ఎలా తయారు చేయాలో స్వయంగా నేర్చుకున్నానని, ఏ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకోలేదని చెప్పాడు. నల్లగొండలో మరొక షాపు పుల్లారావు స్వీట్ హౌస్ పక్కన ఉన్ంది. రెండు షాపుల వ్యాపారం ద్వారా ఖర్చులు పోను దాదాపు లక్ష రూపాయలు దాకా మిగులుతున్నాయి. యువతకు ఎవరైనా వ్యాపార రంగంలో రావడానికి ఉత్సాహం ఉంటే వారికి ఫ్రాంచైజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రస్తుతం ఉద్యోగాలే జీవితాలు కావు చేయాలనే ఆలోచన. సంకల్పం ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు అనడానికి నిదర్శనం నేనే అని ఈ సందర్భంగా తెలియజేశారు.
జీవితంలో విజయానికి ఉద్యోగం ఒక్కటే మార్గమయ్యే రోజులు పోయాయి. ఆలోచనలతో, సృజనాత్మకతతో ముందుకు సాగినప్పుడు వ్యాపార రంగంలోనూ గొప్ప అవకాశాలు ఉన్నాయి. మేడి నాగరాజు కథ నిరుద్యోగంలో ఉన్న యువతకు వెలుగు చూపించే మార్గదర్శకంగా నిలుస్తుంది. అంకితభావం ఉంటే టీ వ్యాపారమైనా లక్షల ఆదాయం తెచ్చిపెట్టవచ్చని ఈ కథ మనకు చెప్పుతోంది.
లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
నల్గోండా, తెలంగాణ
జూన్ 20, 2025 4:14 PM
























