చివరిగా నవీకరించబడింది:
కాకినాడ-సామర్లకోట రహదారిలో దొరికే బెల్లం జీడిలు ఆరోగ్యవంతమైన స్వీట్లు. బెల్లంతో తయారైన ఈ స్వీట్లు మధుమేహ సమస్యల మధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
గోదావరి జిల్లాలకు చెందిన ప్రజలకో డిఫరెంట్ అలవాటు ఉంది. వారికి షుగర్ ఉన్న లేక ఇతర సమస్యలు ఉన్న ఆ అలవాటు మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తారు. మధ్యాహ్నం అయినా, రాత్రి అయినా భోజనం పూర్తయిన తర్వాత వారు తప్పనిసరిగా స్వీట్ తింటారు. అందుకే ఆ జిల్లాల్లో స్వీట్స్ చాలా ఫేమస్. శరీరానికి తక్కువ ఇబ్బంది కలిగించే స్వీట్ కోసం ఎన్నో తరాలుగా వారు అనుసరిస్తున్న ఈ పద్ధతి ఇప్పుడు ఆరోగ్యవంతమైన మిఠాయిలకు మంచి ఉదాహరణగా నిలుస్తోంది.
అందరూ షుగర్ భయంతో పంచదారతో చేసిన స్వీట్లు తినడాన్ని తగ్గిస్తుంటే, ఈ జిల్లా ప్రజలు మాత్రం బెల్లంతో తయారైన ప్రత్యేకమైన స్వీటుతో తమ భోజనాన్ని ముగిస్తారు. ఇది వారి ఆరోగ్యాన్ని బాగానే కాపాడుతుంది, అదే సమయంలో రుచి కోనసాగేలా చేస్తుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే బెల్లం జీడిలు అనే స్వీట్‌కి ఇక్కడి ప్రజల్లో అమితమైన క్రేజ్ ఉంది.
ఈ బెల్లం జీడిలు సాధారణంగా కాకినాడ – సామర్లకోట రహదారిలో దొరుకుతాయి. అక్కడ ప్రత్యేకంగా సిద్ధం చేయబడుతున్న ఈ జీడిలు అంత మెత్తగా ఉంటాయి అన్నది వినగానే ఆశ్చర్యం కలిగిస్తుంది. పెద్దవాళ్లైనా, పిల్లలైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా తినగలిగేలా ఈ స్వీట్లు తయారు చేయబడతాయి. పళ్ళు లేని వృద్ధులు కూడా తినగలుగుతారంటే, వాటి మెత్తదనం అర్థమవుతుంది.
ఇక్కడి బెల్లం జీడిల ప్రత్యేకత ఏమిటంటే, అవి పూర్తిగా బెల్లంతో తయారు చేయబడటం మాత్రమే కాదు… అసలు తయారీ ప్రక్రియే ఒక అనుభూతి. మన కళ్ళముందే వాటిని తయ్యారు చేస్తూ, సాగదీస్తూ, తరిగి ప్యాక్ చేస్తూ ఉండటం చూసినవారికి ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది.
పెరిగిపోతున్న మధుమేహ సమస్యల మధ్య ఆరోగ్యానికి హాని కలిగించకుండా, ఓ మంచి అలవాటుగా నిలుస్తున్న ఈ బెల్లం జీడిలు.. స్థానికులకే కాదు, ఈ జిల్లాకు వచ్చే ప్రతి పర్యాటకుడికి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. మీకు కూడా భోజనం తర్వాత ఓ హెల్ధీ స్వీట్ తినాలనే ఆసక్తి ఉంటే… కాకినాడ సామర్లకోట హైవే వైపు ఓ సారి తిరిగి చూడండి. అక్కడ దొరికే అసలైన బెల్లం జీడిల రుచి మీ మధుర జ్ఞాపకాలలో నిలిచిపోతుంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్
జూన్ 19, 2025 6:29 PM
























