చివరిగా నవీకరించబడింది:
Temple Spiritual Secrets: కలియుగంలో పెరిగిపోతున్న పాపాన్ని నశింప చేసేందుకు ఇప్పటికే అక్కడ కాళ్లకు గజ్జలు కట్టుకుని అమ్మవారు చిన్నారి రూపంలో తిరుగుతూ ఉంటారట. అయితే ఈ అమ్మవారి శబ్దాలు ఎన్నోసార్లు విన్నామని గ్రామస్తులంటున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది..? లోకల్18 స్పెషల్ రిపోర్ట్ సేకరించింది.
ఆలయ ఆధ్యాత్మిక రహస్యాలు: కలియుగంలో పెరిగిపోతున్న పాపాన్ని నశింప చేసేందుకు ఇప్పటికే అక్కడ కాళ్లకు గజ్జలు కట్టుకుని అమ్మవారు చిన్నారి రూపంలో తిరుగుతూ ఉంటారట.. అయితే ఈ అమ్మవారు శబ్దాలు ఎన్నోసార్లు విన్నాం అంటూ అక్కడ గ్రామప్రజలే కాదు రాత్రి సమయంలో తిరిగే గోర్కాలు సైతం స్పష్టంగా పేర్కొంటున్నారు.. నాటిరోజులైనా నేటిటెక్నాలజీ రోజులైనా దాదాపు సంవత్సరాల కిందట ఏ సాంప్రదాయం ప్రారంభించారో అదే సాంప్రదాయం ఇప్పటికే అక్కడ కొనసాగడానికి అమ్మవారు నిదర్శనమే కారణం అంటున్నారు గ్రామీణ ప్రాంత ప్రజలు.. సూర్యుడు ఉదయించాడా లక్షలాదిగా భక్తులు ఆ క్షేత్రానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని వందలాది ఎకరాలతో కూడిన అటవీ ప్రాంతంలో భక్తులు వంటావార్పు చేసుకుని ప్రసాదాలుగా స్వీకరిస్తారు..
ఒక సాయంత్రం 6 దాటిందా అక్కడ చీమ చిటిక మనదట… దేవస్థానం ఉద్యోగులైన భక్తులైన ఆగీత దాటే ప్రయత్నం నేటి వరకు ఎవరు చేయలేదట. . ఇంతకి చిన్న ఆధ్యాత్మిక ఉదాహరణ ఇద్దరు దంపతులు తనచిన్నారితో కలిసి క్షేత్రానికి వచ్చి క్షేత్రంలో పాపను మరిచిపోయి కొండ దిగేసారట.. పాప కోసం వెనక్కి వెళ్లాలంటే సమయం ఆరు దాటింది గ్రామస్తులు ఎట్టు పరిస్థితిలో పైకి వెళ్లేందుకు అనుమతించలేదట. అమ్మవారి తిరుగుతుంది పాపకొచ్చిన భయం లేదు అని చెప్పారట..ఉదయం 6 అయ్యేసరికి గ్రామస్తులు దంపతులు కొండపైకి ఎక్కారు చిన్నారి ఊయలలో ఆడుకుంటూ కనిపించింది.. ఇదికాదా నిదర్శనం ఇక్కడ అమ్మ సాయంత్రం ఆరు దాటితే తిరుగుతుంది అనడానికి అని గ్రామస్తులు పేర్కొంటున్నారు.. కలియుగంలో సైతం మానవులు తప్పిదాలను చక్కదిద్దుతూ నేను ఇక్కడ ఉన్నాను అని చూపిస్తున్న ఆ క్షేత్రం ఎక్కడ ఉంది.. ఇప్పటికీ రాత్రి అయితే ఎందుకు క్షేత్రానికి వెళ్ళరు. అక్కడ రాత్రులు తిరిగే గోర్కాలు ఏమంటున్నారు..అర్చకులు కథ ఏం చెబుతున్నారు..వాస్తవ విషయాలు ఎక్స్ క్లూజివ్ గా లోకల్ 18 అందిస్తుంది క్లుప్తంగా చూద్దాం..
ఆగర్శ మహాముని తపస్సు నేపథ్యంలో కొన్ని వందల సంవత్సరాల కిందట కాకినాడజిల్లా లోవ కొత్తూరు అటవీ ప్రాంతంలో ధారాతీగ కోండల నడుమ రాతి రూపంలో అమ్మవారు స్వయంభుగా వెలిశారు. అక్కడ అమ్మవారిని గొర్రెల కాపరి గుర్తించారు ప్రస్తుతం జగత్ జ్జననిగా ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా తలంపులమ్మ అమ్మవారిగా అమ్మవారు విరాజిల్లుతున్నారు.. కాకినాడ జిల్లాలో అన్నవరం తర్వాత మరల అంత పెద్ద మొత్తంలో ఆదాయం భక్తుల రాక కూడా ఈ దివ్య క్షేత్రానికే ఉందని చెప్పుకోవచ్చు.. అయితే ఈ దివ్య క్షేత్రంలో అమ్మవారు ఇప్పటికీ సాయంత్రం 6 దాటితే సంచరిస్తారు అని అర్చక స్వాములు పదేపదే చెబుతూ ఉంటారు.. దీనికి నిదర్శనమే సాయంత్రం ఐదు 59 నిమిషాల తర్వాత వందలాదిగా పనిచేసే దేవస్థానం ఉద్యోగులు గాని లక్షలాదిగా వచ్చే భక్తులు గాని ఆ క్షేత్రంలో ఉండరు.. మరలా ఉదయాన్నే అమ్మవారి దర్శనం పూజలు అన్నీ మామూలే అంటున్నారు అర్చకుల బృందం.. అయితే చీకటి పడితే నిజంగా ఎవ్వరు ఉండరు ఇక్కడ అమ్మవారు గజ్జలు కట్టుకునే తిరుగుతారు అన్న వాస్తవ విషయాన్ని ఆధ్యాత్మికంగా చూపించేందుకు లోకల్ 18 ప్రతినిధులు అమ్మవారి ఆశీస్సులతో రంగ ప్రవేశం చేశారు..
ఎక్కడ ఆర్చ గేటు దాటకుండా. ఉన్న వాస్తవ విషయాన్ని అక్కడ గోర్క ద్వారా అక్కడ శబ్దం చేస్తున్న కాలభైరవుల ద్వారా చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. . దారంతా చీకటి ఎటు చూసినా కాలభైరవుల అరుపులతో కూడిన రక్ష మరోపక్క గళ్ళు గళ్ళు మంటూ శబ్దం లోవక్షేత్రంలో ప్రతినిత్యం వినిపిస్తూనే ఉంటుంది.. కనుక ఒక మారుమూల గ్రామంలో అమ్మవారు ఆలయం ఉన్నప్పటికీ మహిమాన్విత దివ్య క్షేత్రంగా శ్రీ తలంపులమ్మ అమ్మవారి దివ్య క్షేత్రం విరాజిల్లుతూ ఉంది.. ఇక్కడ అమ్మవారికి ఆషాడం శ్రావణం శరన్నవరాత్రులు గంధమావాస్య వంటి ఉత్సవాలు కనీవిని ఎరుగని రీతిలో దేవస్థానం కార్యనిర్వాహన అధికారి పెనుమత్సు విశ్వనాథ్ పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి..
ముఖ్యంగా ఇక్కడ ఆనవాయితీ ప్రకారం నాన్ వెజ్ వంటకాలు భక్తులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు…అమ్మవారి దర్శనం అనంతరం ఎత్తైన పచ్చని చెట్ల కింద భక్తులు వంటావార్పు చేసుకుని కుటుంబాల సమేతంగా ప్రసాదాలుగా స్వీకరిస్తారు..మరోపక్క కొండపై పుణనిర్మాణ రాజగోపురం పనులు సైతం జరుగుతున్న వేళలో భక్తులు విరాళాలు అందించి అమ్మవారి నిర్మాణ పనుల్లో భాగస్వాములు కావాలని దేవస్థానం కోరుతుంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
కాకినాడ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్
ఆగస్టు 26, 2025 2:05 PM
























