చివరిగా నవీకరించబడింది:
కాకినాడ-సామర్లకోట రహదారిలోని చెట్టు కింద శ్రీ ముత్యాలమ్మ తల్లి స్వయంభువుగా వెలసిన ఆధ్యాత్మిక ప్రదేశం ఉంది. ఆలయం లేకపోయినా, భక్తులు ఆ చెట్టును ఆలయంగా భావించి అమ్మవారిని దర్శించుకుంటారు.
కాకినాడ నుంచి సామర్లకోటకు వెళ్లే రహదారిలో ఓ చెట్టు కింద.. ఆ ఆధ్యాత్మిక ప్రదేశం ఉంది. ఇక్కడ ఆలయం లేదు. పూలమాలలు, రంగురంగుల లైట్లు ఏమీ కనిపించవు. కానీ అక్కడికి ఎవరు వచ్చినా అక్కడికి వచ్చి దర్శించుకుంటారు. చిన్నపిల్లాడు అయినా, ఆర్టీసీ బస్సు డ్రైవర్ అయినా… ఆ చెట్టు కింద ఆగుతారు. అక్కడ కొలువై ఉన్న అమ్మవారికి నమస్కారం చేసి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అంత పవిత్రత, అంత భక్తి, అంత విశ్వాసం ఉన్న స్థలం అది.
వందల ఏళ్ల కిందట ఆ చెట్టులోనే స్వయంభువుగా వెలసిన అమ్మవారు.. శ్రీ ముత్యాలమ్మ తల్లి. చుట్టుపక్కల ప్రజలు ఈ అమ్మవారిని సువాసన భరితమైన తల్లి అంటూ పిలుస్తారు. ఎందుకంటే ఆ ప్రాంగణంలో అడుగుపెడతూనే ఓ ఆధ్యాత్మిక సువాసన మనసును తాకుతుంది. మనస్సుకు ఓ శాంతిని పంచుతుంది. అమ్మవారు కనిపించేది చెట్టులోనే. విగ్రహం లేదు. ఆలయం లేదు. అయినా ఆ చెట్టే ఆలయంగా మారిపోయింది. ఆ చెట్టే శాంతి స్థూపంగా నిలిచిపోయింది.
ఆ ప్రాంతాన్ని చూసిన వారంతా ఒక్క మాటే చెబుతారు.. ఇక్కడ అడుగు పెట్టగానే ఎలాంటి ఉద్విగ్నత అయినా తగ్గిపోతుందని.. మండుటెండలోనూ అక్కడ ఉన్న చెట్టు తన చల్లని నీడను చల్లగా కమ్మేస్తుంది. పక్కనే పారే చిన్న సెలయేరు, చెట్టు చల్లని గాలి, అక్కడి మౌనం అన్నీ కలసి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా.. కనిపిస్తాయి. చిన్న పిల్లలు సైకిల్‌పై వెళ్లినా, ఆటోలు, కార్లు, బస్సులు ఏ వాహనమైనా ఈ ప్రాంగణంలో ఆగి అమ్మవారిని దర్శించుకుంటాయి. ఎందుకంటే, ఆమె ఆశీస్సులు ఉంటే ప్రయాణం సురక్షితంగా సాగుతుందని ప్రజల నమ్మకం. ఆ నమ్మకం కొన్ని రోజులకు కాదు… కొన్ని తరాలనుంచే అంతే స్థిరంగా ఉంది.
ఆ చెట్టు కింద నిలిచిన అమ్మవారి రూపం చూసి, మౌనంగా నమస్కరించి వెళ్లే భక్తులు, తమ కోరికలు తల్లి తీర్చుతుందనే నమ్మకం అక్కడి వారిది. కోరినదాన్ని పొందిన ఆనందంతో మళ్లీ తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెబుతారు. ఆలయం లేకపోయినా, అక్కడి భక్తి మాత్రం ఆలయాల కన్నా గొప్పదని చెప్పాల్సిందే. కాకినాడ వచ్చి, సామర్లకోట వైపు ప్రయాణిస్తే, ఈ చెట్టు వద్ద కచ్చితంగా ఆగండి. శ్రీ ముత్యాలమ్మ తల్లి దర్శనంతో ఒక్కసారి దర్శించుకోండని స్థానికులు అంటున్నారు. అమ్మవారి ఆశీస్సులతో మీ ప్రయాణం ప్రశాంతంగా సాగుతుందని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్
జూన్ 21, 2025 4:56 PM
























