చివరిగా నవీకరించబడింది:
ఏలూరు ఐటీడీఏ కేర్‌పురంలో జూన్ 21న మెగా జాబ్ మేళా. హ్యుందాయ్, టాటా, ఫ్లిప్‌కార్ట్ వంటి 25+ సంస్థలు పాల్గొంటాయి. 18-35 ఏళ్ల నిరుద్యోగులు పాల్గొనండి.
ఏలూరు జిల్లా ఐటీడీఏ కేర్‌పురంలో ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో.. జూన్ 21వ తేదీన ఉదయం 9 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ మధు భూషణరావు తెలిపారు. ఈ జాబ్ మేళాలో హ్యుందాయ్ మోటార్స్, టాటా ఎలక్ట్రానిక్స్, ఫ్లిప్‌కార్ట్, విప్రో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డాక్టర్ రెడ్డీస్, కియా మోటార్స్, ముత్తూట్ ఫైనాన్స్, అపోలో ఫార్మసీ, అమర్ రాజా బ్యాటరీస్, హీరో మోటోకార్ప్, దైకిన్ వంటి 25కు పైగా ప్రముఖ బహుళజాతీయ సంస్థలు పాల్గొంటున్నాయి.
జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, నర్సింగ్, ఏదైనా డిగ్రీ, బీటెక్ లేదా పీజీ విద్యార్హతలు కలిగి ఉండాలి. వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000 నుండి రూ.40,000 వరకు జీతం లభిస్తుంది.
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావాలి. అభ్యర్థులు ముందుగా bit.ly/ncsregister లింక్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇతర వివరాల కోసం నేరుగా ఐటిడిఎ కార్యాలయంలో సంప్రదించవచ్చు. ఈ జాబ్ మేళా యువతకు స్థిరమైన భవిష్యత్తు దిశగా మంచి అవకాశం అని నిర్వాహకులు తెలియజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Eluru,West Godavari,Andhra Pradesh
జూన్ 19, 2025 8:16 PM

























