చివరిగా నవీకరించబడింది:
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భీమవరంలో శ్రీ వేంకటేశ్వర బధిరుల ఉన్నత పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు బధిర బాలబాలికల కోసం ప్రవేశాలు ఆహ్వానిస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న.. శ్రీ వేంకటేశ్వర బధిరుల ఉన్నత పాఠశాల.. భీమవరంలో 2025–26 విద్యా సంవత్సరానికి బధిర (చెవిటి, మూగ) బాలబాలికల కోసం 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఈ పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచిత విద్య, నోటు పుస్తకాలు, యూనిఫాంలు, భోజనం మరియు హాస్టల్ వసతి అందించనున్నారు. వయస్సు 6 నుండి 14 సంవత్సరాల మధ్య ఉండి వినికిడి లోపం ఉన్న బాలబాలికలు అర్హులు. నిరుపేద కుటుంబాల చెవిటి, మూగ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే గొప్ప అవకాశం ఇది.
ప్రైవేట్ పాఠశాలల్లో చదివించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ ఉచిత విద్యా అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరుతోంది. ఆసక్తిగల వారు జూన్ 21, 2025 లోపు తమ దరఖాస్తులు సమర్పించాలి. భవిష్యత్తులో పిల్లలు విద్యాపరంగా రాణించేందుకు ఈ విద్యా సంస్థ ద్వారా ఏర్పడుతుందని, జిల్లాలోని బధిర బాలబాలికల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వదులుకోకూడదని పాఠశాల నిర్వాహకులు సూచిస్తున్నారు.
విద్యార్థులు సమర్పించాల్సిన పత్రాలు: ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోటోలు, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల టీసీ, స్టడీ సర్టిఫికెట్లు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్
జూన్ 19, 2025 10:06 PM

























