చివరిగా నవీకరించబడింది:
Viral Video: సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలకు చెందిన ఫాలోవర్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు పార్టీలపై, ఆ పార్టీకి చెందిన నాయకులపై ట్రోల్స్ చేసే విష సంస్కృతి మరింత పెరిగింది. చివరకు అభం శుభం తెలియని తెనాలికి చెందిన మహిళ గీతాంజలి మరణానికి కారణమైంది. అయితే ఇదంతా టీడీపీ, జనసేన కార్యకర్తల కారణమని వైసీపీ ఆరోపిస్తుంటే ..టీడీపీ సంచలన విషయాల్ని బయటపెట్టింది.
సోషల్ మీడియా(Social Media)లో రాజకీయ పార్టీలకు చెందిన ఫాలోవర్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు పార్టీలపై, ఆ పార్టీకి చెందిన నాయకులపై ట్రోల్స్ చేసే విష సంస్కృతి మరింత పెరిగింది. చివరకు అభం శుభం తెలియని తెనాలికి చెందిన మహిళ గీతాంజలి (Geetanjali)మరణానికి కారణమైంది. అయితే ఇదంతా టీడీపీ(TDP), జనసేన (Janasena)కార్యకర్తల కారణమని వైసీపీ ఆరోపిస్తుంటే ..టీడీపీ సంచలన విషయాల్ని బయటపెట్టింది. గీతాంజలి చావుకు కారణం ఆత్మహత్యో లేక ..ట్రోల్స్ కావని …ఆమెను ఎవరో ఇద్దరు వ్యక్తులు రైలు కిందకు నెట్టేయడం వల్లే చనిపోయిందనే నగ్న సత్యాన్ని బయటపెట్టింది. దీనికి సంబంధించిన ఓ వీడియోని కూడా టీడీపీ షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో(Video)ని బయటపెట్టడంతో పాటు నారా లోకేష్ కామెంట్ పోస్ట్ చేశారు. ప్రతీ ఎన్నికలకు ముందు నరబలి జరగాల్సిందే అంటూ కామెంట్ పెట్టారు.సైకో జగన్ (Jagan)పార్టీ వైసీపీ పుట్టిందే తండ్రి శవం దగ్గర లోకేశ్ విమర్శించారు. బాబాయ్ బలితో 2019లో ఓట్లు దండుకుందని ఇప్పుడు ఎందుకోసం గీతాంజలిని బలి తీసుకుందో? అని సందేహం వెలిబుచ్చారు. టీడీపీ విడుదల చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఓవైపు ఏపీ ప్రభుత్వం తరపున మృతురాలి కుటుంబ సభ్యులకు 20లక్షల పరిహారం అందజేశారు మంత్రి విడదల రజనీ. కేవలం టీడీపీ, జనసేన పోస్టులే ఆమె ప్రాణాల్ని బలిగొన్నాయని మరోసారి ఆరోపించారు. గీతాంజలి ఫ్యామిలీకి ప్రభుత్వం, వైసీపీ అండగా ఉంటుందన్నారు.ఆత్మహత్యా లేక ప్రమాదమా..తెనాలికి చెందిన గీతాంజలి అనే ఇద్దరు పిల్లల తల్లి మరణం ..ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేపుతోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఈ మహిళ చావుకు కారణం మీరంటే కాదు మీ ట్రోల్స్ వల్లే అమాయకురాలైన మహిళ చనిపోయిందని నిందను ఒకరిపై మరొకరు మోపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మృతురాలు గీతాంజలికి జగనన్న ఇంటి స్తలం రావడం..ఆ పత్రం తీసుకున్న సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలతో ఈ రాజకీయ హింసాత్మక క్రీడ మొదలైంది. అయితే ఆరోజు మృతురాలు మరోసారి జగనన్నను గెలిపించుకోవాలని చెప్పడంతో పాటు ఇంగ్లీష్ లో మాట్లాడటంతో ఆమెను విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. దీనిపైనే ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఆమెను వారించినట్లుగా తెలుస్తోంది.
ఆత్మహత్యా లేక ప్రమాదమా..
తెనాలికి చెందిన గీతాంజలి అనే ఇద్దరు పిల్లల తల్లి మరణం ..ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేపుతోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఈ మహిళ చావుకు కారణం మీరంటే కాదు మీ ట్రోల్స్ వల్లే అమాయకురాలైన మహిళ చనిపోయిందని నిందను ఒకరిపై మరొకరు మోపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మృతురాలు గీతాంజలికి జగనన్న ఇంటి స్తలం రావడం..ఆ పత్రం తీసుకున్న సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలతో ఈ రాజకీయ హింసాత్మక క్రీడ మొదలైంది. అయితే ఆరోజు మృతురాలు మరోసారి జగనన్నను గెలిపించుకోవాలని చెప్పడంతో పాటు ఇంగ్లీష్ లో మాట్లాడటంతో ఆమెను విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. దీనిపైనే ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఆమెను వారించినట్లుగా తెలుస్తోంది.
వీడియో వైరల్ ..
అయితే ఇదంతా జరిగిన తర్వాత అంటే ఈనెల 7వ తేది ఉదయం తెనాలి రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి చనిపోయింది గీతాంజలి. ఆమె మరణంతో ఆమె ఇద్దరు కూతుళ్లు తల్లిలేని వాళ్లయ్యారు. గీతాంజలి చావుకు ఎవరు కారణమైన ..ఆ కుటుంబం మాత్రం ఇంట్లో దీపం వెలిగించాల్సిన మహిళను కోల్పోవడంతో ఇప్పుడు ఆ వారి ఇల్లు అంధకారంగా మారింది. అయితే ఇదంతా టీడీపీ, జనసేనకు చెందిన కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం వల్లే జరిగిందని ..గీతాంజలి కుటుంబానికి 20లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. పరిహారాన్ని మంగళవారం మంత్రి విడదల రజనీ..స్వయంగా ఇంటికి వెళ్లి ఇచ్చారు. అయితే ఇది జరిగిన కొద్ది సేపటికి టీడీపీ గీతాంజలి చనిపోయిన సమయంలో తెనాలి రైల్వే స్టేషన్ లో వీడియోని బయటపెట్టింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి ఎవరో ఇద్దరు వ్యక్తులు రైలు కింద తోసేశారని చెప్పిన వాయిస్ ఉండటంతో నారా లోకేష్ వాళ్లెవరూ బయటపెట్టాలని..కచ్చితంగా ఇది వైసీపీ రాజకీయ లబ్ది కోసం చేసిన హత్యగానే అభివర్ణిస్తూ కామెంట్ పెట్టారు.
సైకో జగన్ పార్టీ తండ్రి శవం దగ్గర పుట్టింది. బాబాయ్ శవంతో ఓట్లు దండుకుంది. వైకాపా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమైన ప్రస్తుత దశలో ఓ మహిళ శవంతో వికృత రాజకీయాలు ఆరంభించింది. గీతాంజలి అనే ఆమెతో బలవంతంగా వీడియో రూపంలో అబద్ధాలు చెప్పించారు. ఆమె 7వ తేదీన ప్రమాదానికి గురి… pic.twitter.com/v3doSEo5qS
– లోకేష్ నారా (@naralokesh) మార్చి 12, 2024
వైసీపీవి శవ రాజకీయాలు ..
గీతాంజలి ఈనెల 7వ తేదీన ప్రమాదానికి గురైందో, ఆత్మహత్యాయత్నం చేసిందో తెలియదు కానీ… తీవ్రంగా గాయపడితే మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం కూడా వైసీపీ శ్రేణులు చేయలేదని ఆమె నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడితే వైసీపీ సైకోలు అటువైపు కూడా చూడలేదని లోకేష్ కామెంట్ పెట్టారు. చనిపోయిన తర్వాత మాత్రం మృతదేహంతో మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారని… గీతాంజలితో వైసీపీలోని పిల్ల సజ్జల గ్యాంగ్ చెప్పించిన అబద్ధాలను ఖండిస్తూ, టీడీపీ అభిమానులు ఆధారాలతో సహా 10వ తేదీన ప్రశ్నిస్తే దాన్ని టీడీపీ, జనసేన ట్రోల్స్ అంటూ మరో నాటకానికి తెరతీశారని మండిపడ్డారు.
కారకులెవరో తెలియాల్సిందే..
అయితే అసలు గీతాంజలి ఎలా చనిపోయింది..ఆమె మరణానికి కారణం ఎవరనే విషయాలపై నిగ్గు తేల్చాలని..తెనాలి రైల్వే స్టేషన్ లో సీసీ ఫుటేజ్ తో పాటు ఆమెను తోసేసిన ఇద్దరు వ్యక్తులు ఎవరో కనిపెట్టాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుంటూర్, ఆంధ్రప్రదేశ్
మార్చి 12, 2024 10:12 PM

























