ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి, లెజెండరీ తమిళ నటుడు శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఘాటి. చింతకింద శ్రీనివాస్ అందించిన కథను రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో చైతన్య రావు మదాడి, జగపతిబాబు, జిషు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, వీటీవీ గణేష్ తదితరులు నటించారు.
యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫి, తూరుపు చాణక్య రెడ్డి, నాగవెళ్లి విద్యాసాగర్ సంగీతం అందించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీ 2025 తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా గురించి క్రిటిక్స్ వెల్లడించిన ఇన్‌సైడ్ టాక్ వివరాల్లోకి వెళితే..
ఘాటీి సినిమా కమర్షియల్ యాక్షన్ డ్రామా. క్రిష్ ట్రేడ్ మార్క్ స్లయిల్ ఉంటుంది. అనుష్క శెట్టి పెర్ఫార్మెన్స్ అత్యంత ఎమోషనల్‌గా, ఇంటెన్స్‌గా ఉంటుంది. ఆడియెన్స్‌కు ఈ మూవీ గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్. టీజర్, ట్రైలర్‌లో కొనసాగిన ఇంటెన్సిటీ సినిమా మొత్తం కనిపిస్తుంది అని క్రిటిక్ కామెంట్ చేశాడు.
ఘాటి సినిమా రన్ టైమ్ 2 గంటల 35 నిమిషాలు. ఫస్టాఫ్ అంతా ఎమోషనల్ జర్నీగా సాగుతుంది. సెకండాఫ్‌లో పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా ఉంటుంది. అనుష్క శెట్టికి, డైరెక్టర్ క్రిష్‌కు ఈ సినిమా కమ్ బ్యాక్ మూవీ అవుతుంది. ఈ సినిమాకు సూపర్ హిట్ కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి అని ఓ క్రిటిక్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఘాటి సినిమాలో అనుష్క శెట్టి శీలావతి అనే పాత్రలో ఉగ్రరూపం చూపించింది. తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న విక్రమ్ ప్రభు తన నటనతో మెరుపులు మెరిపించాడు. ఫస్టాఫ్ రోలర్ కోస్టర్ రైడ్ ఉంటుంది. రైల్వే స్టేషన్ యాక్షన్ ఎపిసోడ్ ఆడియెన్స్ ఊపిరి బిగపట్టి చూసేలా ఉంటుంది. శీలావతి అనే ఓ మహిళ బాధితురాలి నుంచి క్రిమినల్‌గా.. అక్కడి నుంచి ఓ లెజెండ్ ఎలా అయ్యారనే కథ అని ఓ క్రిటిక్ తన పోస్టులో పేర్కొన్నారు.
ఘాటీ సినిమా గురించి ప్రీ రిలీజ్ రిపోర్ట్ ఏమిటంటే.. ఈ సినిమా యావరేజ్‌ను మించిపోయిన మంచి సినిమా. ఫస్టాఫ్, సెకండాఫ్‌లో జరిగే డ్రామా ఎపిసోడ్స్ కొంత స్లోగా సాగుతాయి. యాక్షన్ ఎపిసోడ్స్, సినిమాటోగ్రఫి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అనుష్క శెట్టి, జగపతిబాబు, చైతన్యరావు, విక్రమ్ ప్రభు పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొంటారు అని ఓ క్రిటిక్ కామెంట్ చేశాడు.
ఘాటి థియేటర్‌లో ఉరుములు, మెరుపులు కురిపించేందుకు సిద్దంగా ఉంది. శీలావతి పాత్రలో అనుష్క శెట్టి నటన అదిరిపోయిది. వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగుంది. అనుష్క కెరీర్‌లో ఇప్పటి వరకు ఇచ్చిన బెస్ట్ పెర్ఫార్మెన్స్‌లో ఒకటి. కథ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. బడ్జెట్ పరిమితుల వల్ల టెక్నికల్ కొన్ని మైనస్‌లు ఉన్నాయి. అనుష్క ఇంతకు ముందు సినిమాలతో పోల్చుకొంటే.. ఇది బెటర్ సినిమాగా ఉంటుంది. యావరేజ్‌ను మించి ఈ సినిమా ఉంటుంది అని ఓ క్రిటిక్ తన ఒపినియన్‌ను వెల్లడించారు.
























