ఒంటిమిట్టలో శ్రీ సీతారామ లక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు
– రూ.6.60 కోట్ల విలువైన మూడు వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలను విరాళంగా అందించిన పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్ రెడ్డి

మీడియా ప్రతినిధి – ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయానికి సుమారు రూ.6.60 కోట్ల విలువైన మూడు వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలను పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం అందజేశారు.
దాదాపు 7 కేజీల బంగారంతో తయారు చేసిన ఈ స్వర్ణ కిరీటాలను ఆలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్.నాయుడు, ఈవో శ్యామలరావులకు దాత అందించారు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈ కిరీటాలను శ్రీసీతారామ లక్ష్మణుల మూల మూర్తులకు అలంకరించారు.





















