విమానాశ్రయానికి ప్రతిపాదించిన భూములకు సంబంధించిన వివరాలను మ్యాపుల ద్వారా ఆర్డీఓ జాన్ ఇర్విన్, జిల్లా కలెక్టర్ కు వివరించారు. దొనకొండ విమానాశ్రయ పూర్తి సమాచారంను క్లుపంగా నివేదికను సిద్ధంచేసి అందజేయాలని జిల్లా కలెక్టర్, ఆర్డీవో ను ఆదేశించారు. 90 ఏళ్ల చరిత్ర గల ఈ విమానాశ్రయం ఇప్పుడు అభివృద్ది పథం లోకి వచ్చే అవకాశం ఉండడంతో, దొనకొండ వాసులు, జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

























