చివరిగా నవీకరించబడింది:
తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ UPSC సివిల్ సర్వీసెస్ – 2026 కోసం రెసిడెన్షియల్ గైడెన్స్, శిక్షణకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో UPSC సివిల్ సర్వీసెస్ – 2026 పరీక్షలకు సిద్ధం కావాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల కోసం హైదరాబాద్ గిరిజన IAS స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ గైడెన్స్, శిక్షణ కార్యక్రమానికి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక ఆబ్జెక్టివ్ టైప్ ఆప్టిట్యూడ్ పరీక్ష ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వార్షిక కుటుంబ ఆదాయం రూ.3 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. దరఖాస్తుకు సంబంధించి వివరాలు, నమోదు కోసం అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. మరిన్ని వివరాలకు ఫోన్: 6281766534 నంబర్‌ను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సంప్రదించవచ్చు.
అదే విధంగా, కరీంనగర్ జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో ఉద్యోగాల కోసం జూన్ 21 (శనివారం) నాడు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు తెలిపారు. ఈ జాబ్ మేళా తనిష్క్ జ్యూవెలరీ, నాలుగో అంతస్తు, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా, కరీంనగర్లో జరగనుంది.
మొత్తం 20 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు డిగ్రీ పాస్ అయిన 20-45 ఏళ్ల వయస్సు గల మహిళా అభ్యర్థులు అర్హులు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు జిరాక్స్ సర్టిఫికెట్లు, ఫోటోలు తీసుకొని ఉదయం 11 గంటలకు నమోదు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 9848168440, 6281363903 నంబర్లను సంప్రదించవచ్చు.
లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ మేళా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, లేటెస్ట్ కోర్సులు, స్కాలర్షిప్స్, విద్యకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో తెలుసుకోండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
కరీంనగర్, తెలంగాణ
జూన్ 20, 2025 3:09 PM

























