అకాల వర్షానికి తడిసిన ధాన్యం
మీడియా ప్రతినిధి – దాచేపల్లి: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం సాయంత్రం కురిసిన ఆకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది.
వివిధ గ్రామాల నుంచి రైతులు వరి కోతలు కోయించిన దాన్యాన్ని అమ్ముకోవడానికి దాచేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకుని వచ్చి, తేమ శాతం పోవడానికి ఆరబెట్టారు.
అకస్మాత్తుగా కురిసిన వర్షానికి వందలాది ఎకరాలలో పండించి తెచ్చిన ధాన్యం తడిసి పోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు
పట్టలు కప్పే సమయం కూడా లేకపోవడంతో వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసి పోయింది.
ప్రభుత్వం తమని ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
























