చివరిగా నవీకరించబడింది:
సాధారణంగా ఆంజనేయ స్వామికి ప్రతి గ్రామంలో ఒక గుడి ఉంటుంది. రావణుడు సీతను అపహరించిన సమయంలో రాముడికి ఎలా సాయం చేశాడో.. అదే విధంగా ఊరిని కూడా దుష్టశక్తుల నుంచి కాపాడుతాడని ప్రజల విశ్వాసం.. అందుకే ఊరికి చివర హనుమంతుడి ఆలయం తప్పకుండా ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ గ్రామంలో చూసిన హనుమంతుని ఆలయం కనిపిస్తుంది. అయితే, హనుమంతుడి ఆలయాల్లో ఒకొక్క ఆలయం ఒకొక్క విశిష్టతను కలిగి ఉంటుంది. అభయాంజినేయుడిని భక్తుతో వేడుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తులు భావిస్తుంటారు.

ఇలా గ్రామాల్లో 10-15 అడుగుల ఆంజనేయ విగ్రహాలను చూస్తుంటాం. అప్పటికి ఆ విగ్రహాన్ని చూసి వామ్మో ఏంటి ఇంత పెద్ద విగ్రహమా.. అని ఆశ్చర్యపోతూ…సెల్ఫీలు తీసుకుంటుంటాం… అయితే ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూస్తే ఔరా అనక మానరు. ఈ విగ్రహం చాలా పెద్ద ఎత్తును ఆకర్షణగా నిలుస్తోంది. ఈ విగ్రహా విశిష్టతను న్యూస్ 18 ద్వారా తెలుసుకోండి. 24 అడుగుల హనుమంతుడి విగ్రహం ఎక్కడో తెలుసా.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏకైక హనుమాన్ ఆలయం వేలాది భక్తుల పూజలు అందుకుంటున్న ఆంజనేయుడు.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో పొన్నూరు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం అతి పెద్దదనే చెప్పాలి. ఇక్కడ స్వామివారి విగ్రహం 24 అడుగుల ఎత్తు లో ఏకశిల పై చెక్కబడి రూపొందించారు. సద్గురు శ్రీ జగన్నాధ స్వామి ఆధ్వర్యంలో నిష్ణాతులైన శిల్ప కళాకారులను పిలిపించి వారిచే యడ్లపాడు కొండల్లో ఆంజనేయస్వామి విగ్రహానికి అవసరమైన ఏకశిలా విగ్రహాన్ని చెక్కించి అక్కడి నుంచి వేల మంది భక్తులతో దీక్ష ధారణ చేయించి.. వారందరి సమక్షంలో వందలాది ఎడ్లబండ్ల పై విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న దేవాలయానికి తరలించారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామి వారి కి నిత్యం పూజ… కైంకర్యాలతో పాటు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. భారీ హనుమంతునికి ఆలయం నిర్మించి నిత్యం పూజలు చేయడం ఇక్కడ విశేషం. ఇదే ఆలయ ప్రాంగణంలో 30 అడుగుల గరుక్మంతుని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం మరో విశేషం. పొన్నూరు లోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి దర్శించుకుంటే సకల కోరికలు నెర వేరుతాయని భక్తులు నమ్ముతారు ఇక్కడ ప్రతి శనివారం మంగళవారం భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారికి పూజా భిషేకాలు నిర్వహిస్తారని అర్చకులు రంగనాధబాబు తెలిపారు
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుంటూర్, ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 13, 2023 7:14 PM