చివరిగా నవీకరించబడింది:
పల్నాడు జిల్లా (Palanadu District) అటవీశాఖ ఆధ్వర్యం లో 10 ఎకోటూరిజం ప్రాజెక్ట్ లను చేపట్టింది. ఇప్పటికే కొండవీడు, కోటప్పకొండ ఎకో టూరిజమ్ పార్క్ లు ప్రజలకు అందుబాటు లో ఉన్నాయి.
పల్నాడు జిల్లా (Palanadu District) అటవీశాఖ ఆధ్వర్యం లో 10 ఎకోటూరిజం ప్రాజెక్ట్ లను చేపట్టింది. ఇప్పటికే కొండవీడు, కోటప్పకొండ ఎకో టూరిజమ్ పార్క్ లు ప్రజలకు అందుబాటు లో ఉన్నాయి. వీటిని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.మరి కొన్ని ఎకో టూరిజమ్ పార్క్ లు మరియు నగర వనాలు త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని పల్నాడు జిల్లా డి.ఎఫ్.ఓ రామచంద్రరావు తెలిపారు. పల్నాడు జిల్లా లో సుమారు లక్షా యాభై వేల హెక్టార్ల లో అటవీ ప్రాంతం విస్థరించి ఉందని జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు తెలియజేశారు. అటవీ శాఖ పరిధి లోని పలు ప్రాంతాలలో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని దీని వల్ల అడవుల వల్ల మానవాళికి కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కలుగుతుందని ఆయన తెలియజేశారు.కొండవీడులో త్వరలోనే ట్రెక్కింగ్ రాక్ క్లైంబింగ్ బోటింగ్ వంటి సదుపాయాలను అందుబాటులోకి తెస్తామని ఆయన తెలియజేశారు.
జిల్లా లో మొత్తం పది ఎకోటూరిజం పార్కులను అభివృద్ధి చేయటం కోసం ప్రణాలికలు రూపొందించామని ఆయా ప్రాంతాలలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి పర్యాటకుల కొరకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని తేలియజేశారు.
వెదురు బొంగులతో తయారు చేసిన కళాకృతులను ఏర్పాటు చేసి పర్యాటకులను ప్రకృతి తొ మమేకం అయ్యేలా ఆహ్లాద కరమైన వాతావరణం ఉండేలా ప్రణాలికలు రూపొందించడం జరిగిందని డి.ఎఫ్.ఓ తెలియజేశారు.అడవులు అనేవి జీవవైవిధ్యానికి ప్రతీకలు అని అడవులను సంరక్షించుకోవడం మన భాధ్యత అని డి.ఎఫ్.ఓ రామచందర్రావు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుంటూర్, ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 04, 2023 9:59 PM
























