చివరిగా నవీకరించబడింది:
Ganesh Chathurthi: వినాయక చవితి కోసం శరవేగంగా ముస్తాబవుతున్నారు గణనాధులు. రాజస్థాన్ నుండి వచ్చిన కళాకారుల తో విగ్రహాల తయారీ అవుతున్నాయి. ఇప్పటికే రకరకాల రూపాలలో రంగురంగుల విగ్రహాల తయారవుతున్నాయి. అయితే వర్షాల దెబ్బకి విగ్రహాల తయారీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి..
Ganesh Chathurthi: వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా..అంటూ భక్తుల నుండి ప్రధమ పూజలు అందుకునే గణనాధుడు చవితి వేడుకలకు సర్వాంగ సుందరంగా సిధ్ధం అవుతున్నాడు. వినాయక చవితి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా గణనాధుని కోసం రకరకాల ఆకృతులలో వివిధ రూపాలలో ప్రత్యేక అలంకరణలతో విగ్రహాలు తయారు చేసి పూజించడం సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఈ ఏడాది కూడా వినాయక చవితి ఉత్సవాల కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందు లో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా రాజస్థాన్ నుండి వచ్చిన విగ్రహాల తయారీ దారులు అందమైన ఆకృతులలో వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ కొబ్బరి పీచు మిశ్రమంతో ఎంతో చక్కగా వినాయక ప్రతిమలు తయారు చేసి వాటిని ఆకర్షణీయమైన రంగులతో మరింత అందంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ వెయ్యి రూపాయల నుండి లక్ష రూపాయల వరకు విలువైన విగ్రహాలు తయారు చేస్తామని తయారీ దారులుసంతోష్ తెలియజేస్తున్నారు.
ఐతే వర్షాల కారణంగా విగ్రహాల తయారీలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురౌతున్నాయని , వాతావరణం అనుకూలిస్తే మరిన్ని విగ్రహాలను తయారు చేసే అవకాశం ఉంటుందని తయారీ దారులు తెలియజేస్తున్నారు.కరోనా తర్వాత వినాయక విగ్రహాల పరిశ్రమ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటుందని, గత నాలుగేళ్ళుగా ఊహించిన స్థాయిలో వ్యాపారం జరగడం లేదని , ఏటికేడు పెరుగుతున్న ముడిసరకుల ధరలు ,కూలీలు , ప్రతికూల వాతావరణ పరిస్థితులు తమకు నష్టాలనే మిగులుస్తున్నాయని ఈ ఏడాదైనా తమ వ్యాపారం పుంజుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుంటూర్, ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 12, 2023 3:22 PM
























