చివరిగా నవీకరించబడింది:
ప్రస్తుతం చాలా మంది సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో.. ఎన్నో అడ్డదార్లు తొక్కుతున్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి.. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో మోసగాళ్లు ఎంతటికైనా తెగిస్తున్నారు. ఇప్పటికే ఏటీఎమ్‌ల వద్ద డబ్బులు విత్ డ్రాలు చేసేటప్పుడు మోసాలు.. సైబర్ క్రైమ్ మోసాలు భారీగా పెరిగిపోయాయి. ఇలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా.. పలువురిని అదుపులోకి తీసుకొని శిక్షిస్తున్నా.. కేటుగాళ్లు మాత్రం వారి పద్ధతి మార్చుకోవట్లేదు.

తాజాగా బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో నక్సల్స్ పేరుతో కొంత మంది ఓ డాక్టర్ ను బెదిరించి కోటి రూపాయలు ఇమ్మంటూ డిమాండ్ చేశారు. ఈసంఘటనలో పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బాపట్ల డీఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలియజేశారు. చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లి కి చెందిన డా. గణేష్ ను బెదిరిస్తే డబ్బులు వస్తాయని పథకం పన్నిన కొందరు.. పాడేరు జిల్లాలో ఓ సిమ్ సంపాదించి.. అక్కడి నుంచి ఫోన్ చేశారు. అనంతరం డాక్టర్ గణేష్ ను బెదిరించి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుంటూర్, ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 06, 2023 7:29 PM