చివరిగా నవీకరించబడింది:
AP Politics: గుంటూరు జిల్లా కేంద్రంలోని గుంటూరు పశ్ఛిమ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి అటు వైసీపీలో ఇటు టిడిపిలో ఆశావాహుల సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతుంది. ఈ సీటు కోసం రెండు పార్టీల నుంచి ఎందుకు అంత డిమాండ్ ఉందో తెలుసా..?
AP Politics: గుంటూరు జిల్లా కేంద్రంలోని గుంటూరు పశ్ఛిమ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి అటు వైసీపీలో ఇటు టిడిపిలో ఆశావాహుల సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతుంది. గత ఎన్నికలలో ఇక్కడి నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచిన మద్దాళి గిరిధర్ ప్రస్తుతం వైసిపి లో చేరారు. దీంతో ఇక్కడ వచ్చే ఎన్నికలలో టీడీపీ నుండి పోటీచేసే అవకాశం ఎవరికి దక్కుతుందోనని ఆ పార్టీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ పార్టీలతో పాటు కులసమీకరణలు సైతం విపరీతంగా ప్రభావం చూపిస్తాయి. ఈ నియోజకవర్గం ఓటర్లు ఎక్కువ శాతం టిడిపి ఫేవర్ గా ఉంటారు. గతం లో ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన రెండు ఎన్నికలలో సైకిల్ గుర్తుదే విజయం. గతంలో ఈ నియోజకవర్గం నుండి గెలుపొందిన కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా. లక్ష్మీనారాయణ, శనక్కాయల. అరుణ లు మంత్రులు గా విధులు నిర్వర్తించారు. ఇక ఈ నియోజకవర్గం పై రాయపాటి కుటుంబం ఎప్పటి నుండో కన్నేసి ఉంచింది.
మరో వైపు తెదేపా తరఫున గెలిచి వైసిపి పంచన చేరిన సిట్టింగ్ యం ఎల్ ఏ మద్దాళి. గిరిధర్ ఈ సారి తనకే వైసిపి టికెట్ అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఐతే గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ ఛైర్మన్ కావటి మనోహర్ నాయుడు కాపు కోటా లో తనకు ఒక అవకాశం కల్పించాలని పశ్ఛిమ నియోజకవర్గం లో కాపుల ఓట్లు అధికంగా ఉన్నాయని తన కు టికెట్ ఇస్తే పార్టీ వరుసగా రెండు సార్లు ఒడిన స్థానాన్ని గెలిచి అధిష్టానానికి గిఫ్ట్ గా ఇస్తాని అంటున్నారు.
వీళ్ళే కాక తన నియోజకవర్గంలో తీవ్రవ్యతిరేకత ఎదుర్కొంటున్న వైద్య ఆరోగ్య శాఖామంత్రి విడదల రజని, టి.టి.డి ఛైర్మన్ పదవి దాదాపు ఖాయం అయ్యిందని అంతా అనుకున్న టైంలో చివరినిమిషంలో పదవి చేజారడంతో నిరుత్సాహ పడ్డ సీనియర్ బి.సి నేత, పార్టీ ఆదేశంతో గురజాల నియోజకవర్గాన్ని త్యాగం చేసిన జంగ.క్రిష్ణమూర్తి సైతం గుంటూరు పశ్ఛిమ టికెట్ రేసులో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిలో పార్టీ టికెట్ ఎవరికి ఇస్తుందో ఎవ్వరికీ క్లారిటీ లేదు.ఏది ఏమైనప్పటికీ గెలుపు ఓటమి లతో సంభంధం లేకుండా రాష్ట్రం లోని రెండు ప్రధాన పార్టీల నుండి పోటీ చేయడానికి అభ్యర్ధులు మాత్రం భారీగా పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి బి.ఫామ్ దక్కుతుందో కాలమే నిర్ణయించాలి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుంటూర్, ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 06, 2023 10:49 PM

























