చివరిగా నవీకరించబడింది:
వర్షాకాలం (Monsoon) వచ్చిందంటే చాలు అక్కడ వజ్రాల (Diamonds) వేట మొదలవుతుంది. ఒక్కరాయి దొరికితేచాలు రాత్రికి రాత్రే లైఫ్ మారిపోతుందని స్థానికులు భావిస్తారు. అందుకే జోరుగా వర్షాలు కురుస్తుండటంతో వజ్రాల వేటగాళ్లు రెడీ అయిపోయారు.
కె గంగాధర్, న్యూస్ 18, గుంటూర్
వర్షాకాలం (Monsoon) వచ్చిందంటే చాలు అక్కడ వజ్రాల (Diamonds) వేట మొదలవుతుంది. ఒక్కరాయి దొరికితేచాలు రాత్రికి రాత్రే లైఫ్ మారిపోతుందని స్థానికులు భావిస్తారు. అందుకే జోరుగా వర్షాలు కురుస్తుండటంతో వజ్రాల వేటగాళ్లు రెడీ అయిపోయారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో రంగురాళ్లు, వజ్రాల వేట ప్రారంభమైంది. శివారు ప్రాంతమైనబసవమ్మ వాగు దగ్గర రియాల్ ఎస్టెట్ ప్లాట్ల కోసం పోసిన మట్టిలో వజ్రాల కోసం వెతుకుతున్న జనం. బసవమ్మ వాగు పక్కన ప్లాట్లలో బెల్లంకొండ వైపు నుండి తెచ్చిన ఎర్రమట్టిలో వెతుకులాటను ప్రారంభించారు. ఇది తెలిసిన కొందరు వజ్రాలు, రంగురాళ్లు దొరుకుతాయన్న ఆశతో తెగవెతికేస్తున్నారు. వర్షం పడితే చాలు గుంపులు, గుంపులుగా వెళ్లి క్షుణ్ణంగా వెతుకుతుంటారు స్థానికులు.
పిడుగురాళ్ల రోడ్డు లోని పట్టణ శివారు ప్రాంతమైన బసవమ్మ వాగు వద్ద గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఓ వెంచర్ వేశారు. ఈ వెంచర్లో రహదారుల కోసం బెల్లంకొండ ప్రాంతం నుండి తెచ్చిన ఎర్రమట్టిని ఉపయోగించారు. ఈ విషయంతెలిసిన కొందరు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వజ్రాలును అన్వేషిస్తున్నారు. ఒక్క సత్తెనపల్లి వాసులే కాదు చుట్టుపక్కల నరసరావుపేట, చిలకలూరిపేట, ఒంగోలు, వినుకొండ ప్రాంతాల నుండి కూడా వాహనాలలో వచ్చి ఇక్కడ వజ్రాన్వేషణలో నిమగ్నమయ్యారు.
ఒకవేళ వజ్రం దొరికితే వాటిని పసిడి వ్యాపారులకు విక్రయిస్తారు. వజ్రం బరువు, రంగు, జాతిని బట్టి క్యారెట్ లలో లెక్కగట్టి డబ్బులు ఇస్తారు. ఒకే ఒక్క వజ్రం దొరికితే చాలు క్షణాల్లో లక్షాధికారో అయిపోవచ్చు అన్న ఆశ వారిలో కనిపిస్తుంది. గతంలో బెల్లంకొండ మండలం కోళ్ళురులో వజ్రాలు కొందరికి దొరికాయి. అక్కడ కూలీలను పెట్టి మరీ వజ్రాల కోసం గాలించేవారు. బెల్లంకొండ ప్రాంతం నుండి తెచ్చిన మట్టి కాబట్టి అందులో ఖచ్చితంగా రత్నాలు లేదా రంగు రాళ్లు ఉంటాయని భావించి గాలింపు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
సట్టెనపల్లె, గుంటూర్, ఆంధ్రప్రదేశ్
జూలై 14, 2023 6:49 PM
























