చివరిగా నవీకరించబడింది:
లక్ అంటే వీళ్లదే బాస్. ఎందుకంటే.. దొరికిన మందు బాటిల్‌ను దొరికినట్లు ఎత్తికెళ్లిపోయారు. నచ్చిన మందు ఫ్రీగానే తాగేశారు.
ఈ విచిత్రమైన సంఘటన ఎక్కడ జరిగింది? అని అనుకుంటున్నారా.. మన తెలుగు రాష్ట్రాల్లోనే. అది కూడా మన ఏపీలో.. గుంటూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం గుంటూరు పోలీసుల లిక్కర్ బాటిళ్లను పగటగొట్టే కార్యక్రమాన్ని మద్యం ప్రియులు అడ్డుకున్నారు. ఒకేసారి 24,000 కంటే ఎక్కువ మద్యం బాటిళ్లను చూసిన లిక్కర్ ప్రియులు.. తమల్ని తాము నిగ్రహించుకోలేక ఆ మద్యం బాటిళ్లను తీసుకొని పారిపోయారు.
అదేంటి అక్కడ పోలీసులు ఉన్నారు కదా? అనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. ఇదంతా జరిగింది పోలీసు సిబ్బంది ముందే. పోలీసులు బాటిళ్లు ఎత్తుకెళ్లకుండా అడ్డుపడుతున్నా కూడా మద్యం బాబులు మాత్రం చేతికి అందిన బాటిళ్లతో ఊడాయించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పట్టుబడిన మద్యాన్ని పారవేయాలని జిల్లా పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నల్లచెరువులోని డంపింగ్ యార్డులో ఎస్పీ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సాధారణంగా, పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను ధ్వంసం చేయడానికి రోడ్-రోలర్‌ను ఉపయోగిస్తారు.
కానీ ఈసారి వారు ప్రొక్లెయినర్ వినియోగించారు. దీంతో మద్యం బాటిళ్లను నాశనం చేసే కార్యక్రమం నెమ్మదిగా జరిగింది. ఉన్నతాధికారులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో మద్యం ప్రియులు అక్కడికి చేరుకుని సీసాలు లాక్కున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుంటూర్, వారు గంట్, ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 10, 2024 1:07 PM

























