చివరిగా నవీకరించబడింది:
Subramanya Shashti: ఉమ్మడి గుంటూరు జిల్లా మందడంలో శ్రీసుబ్రమణ్యస్వామి షష్టిని పురస్కరించుకొని భారీగా పాలాభిషేకం నిర్వహించారు. మందడంకి చెందిన నండూరి రమేశ్ రాజు స్వామి నివాసంలో స్వయంభూగా వెలసిన సుబ్రమణ్యస్వామి విగ్రహంతో పాటు పుట్ట దగ్గర ఈ ఈకార్యక్రమాన్ని నిర్వహించారు.
సుబ్రహ్మణ్య షష్ఠి: ఉమ్మడి గుంటూరు జిల్లా మందడంలో శ్రీసుబ్రమణ్యస్వామి షష్టిని పురస్కరించుకొని భారీగా పాలాభిషేకం నిర్వహించారు. మందడంకి చెందిన నండూరి రమేశ్ రాజు స్వామి నివాసంలో స్వయంభూగా వెలసిన సుబ్రమణ్యస్వామి విగ్రహంతో పాటు పుట్ట దగ్గర ఈ ఈకార్యక్రమాన్ని నిర్వహించారు. అటు సుబ్రమణ్యస్వామి భక్తులతో పాటు అయ్యప్ప భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని పాలాభిషేకాన్ని తిలకించారు. అయితే సుబ్రమణ్యస్వామికి పదులు, వందల లీటర్లలో కాకుండా వేల లీటర్లతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం నవ నాగుల శిలల ప్రతిష్టాపనతో పాటు సాయంత్రం కావడి మహోత్సవంతో సుబ్రమణ్య షష్టిని సంపూర్ణంగా నిర్వహించారు రమేశ్ రాజు స్వామి.
అమరావతి జిల్లా మందడంలో సుబ్రమణ్యషష్టిని పురస్కరించుకొని స్థానికంగా స్వయంభూగా వెలసిన సుబ్రమణ్యస్వామికి విశేష పూజలు చేశారు గురుస్వామి రమేశ్ రాజు. బుధవారం ఉదయం 10 గంటలకు సుబ్రమణ్య షష్టి నాగ పూజతో ప్రారంభించారు. అటుపై సుబ్రమణ్యస్వామివారికి పాలాభిషేకం నిర్వహించారు. ఇందుకోసం 40 లీటర్ల సామర్ధ్యం కలిగిన 350 క్యాన్లలో 13వేల 200 లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించారు. గురుస్వామి రమేశ్ రాజు నేతృత్వంలో ఈకార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సుబ్రమణ్యస్వామి భక్తులు, అయ్యప్ప భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
అటుపై రమేశ్ గురుస్వామి నివాసంలో సుబ్రమణ్యషష్టిలో కోసం చేసిన పూజలతో పాటు అన్నదానం కార్యక్రమంలో 1000 మంది తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. సుబ్రమణ్యస్వామి పుట్టిన రోజు సందర్భంగా స్వామివారి గుడి దగ్గరే నవ నాగుల ప్రతిష్టాపన జరిగింది. మొదటి రోజు 9 నాగ శిలలను ప్రతిష్టించారు. అటుపై రమేశ్ గురుస్వామి తండ్రి శరాబందిరాజు 36వ సారి అయ్యప్ప మాల ధరించడంతో మహా పడిపూజ జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలోనే కన్నెస్వామి నమిత్ అయ్యప్పమాలాధారణ చేశారు గురుస్వాములు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సుబ్రమణ్యషష్టి సందర్భంగా పాలాభిషేకాన్ని నిరాటంకంగా పూర్తి చేశారు. అటుపై సాయంత్రం కావడి మహోత్సవం జరిగింది. కావడి మహోత్సవంలో గురుస్వామి రమేశ్ స్వామివారి విగ్రహాన్ని మందడం గ్రామంలో ఊరేగించారు. సుబ్రహ్మణ్య స్వామిని నాగ దేవత రూపంలో కూడా పూజిస్తారు. ఈరోజున పుట్టలో పాలు పోయడం లేదా నాగ ప్రతిమలకు పూజ చేయడం చాలా పరమ పవిత్రంగా కొలుస్తారు. ఇక సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి లేదా పటానికి పాలు, పెరుగు, తేనె, పసుపు, గంధం వంటి పంచామృతాలతో అభిషేకం చేశారు స్థానికులు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్
నవంబర్ 27, 2025 9:54 PM IST
























