చివరిగా నవీకరించబడింది:
అత్తలూరు ఆర్గానక్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ కి జాతీయ అవార్డు.
పల్నాడు జిల్లా ఆవిర్భావం నుంచి జిల్లా తొలి జిల్లా కలెక్టర్ గా భాధ్యతలు స్వీకరించిన శివ శంకర్ లోతేటి.. వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు సేంద్రియ ఎరువుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
అందులో భాగంగా వ్యవసాయం, ఉద్యానవన పంటలు, ప్రకృతి వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించి లబ్ధి పొందిన రైతులను.. ప్రతి సోమవారం జిల్లా కలెక్టెర్ కార్యాలయంలో స్పందన హాలులో ప్రశంసా పత్రంతో ప్రోత్సహిస్తున్నారు. రైతుకు వందనం వంటి వినూత్న కార్యక్రమము రూపొందించి అందులో భాగంగా రైతులను సన్మానిస్తున్నారు.
అత్తలూరు పాలెం ఆర్గానిక్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ 2021 సంవత్సరములో మార్కెటింగ్ ప్రారంభించి ధాన్యం, చిరుధాన్యాలు, కూరగాయలు, పాలు, పెరుగు, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ విధానాలకు సంబంధించిన ఘన జీవామృతం, జీవామృతం, అజ్ఞాస్త్రం, పంచగవ్య, నీమాస్త్రం, పలు రకాల కషాయాలను రైతులకు అందజేయడం.. అదేవిధంగా ఆ గ్రామంలోని 450 మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం విధానాలు పాటిస్తూ వరి, మిరప, కూరగాయలు పంటలను పండిస్తూ వారి వద్ద ఉన్న సేంద్రియ ఆహార ఉత్పత్తులను నేరుగా అత్తలూరు ఆర్గానిక్ కంపెనీ వారే కొనుగోలు చేసి మార్కెట్ చేయడం జరుగుతుంది.
సెప్టెంబర్ 7వ తేదీన బయో ప్యాచ్ ఇండియా నేచురల్ ఎక్స్ పో న్యూఢిల్లీ లో జరిగిన కార్యక్రమానికి.. అత్తలూరు రైతు ఉత్పత్తి దారుల సంఘానికి అధ్యక్షులు అయిన జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి హాజరై రైతుల తరఫున ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రైతు సాధికార సంస్థ చైర్మన్ విజయ్‌కుమార తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుంటూర్, ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 09, 2023 1:01 PM

























