చివరిగా నవీకరించబడింది:
Iron Scrap: రాతితో చెక్కి విగ్రహాలను తయారు చేసేవారు.. ఆ తరువాతి కాలంలో సిమెంట్ విగ్రహాలు, కాంస్యవిగ్రహాలు, ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఫైబర్ విగ్రహాలకు డిమాండ్ ఉంటుంది. అయితే వాటికి మించేలా అంటూ ఐరన్ స్క్రాప్ తోనే అద్భుతాలు చేస్తున్నాడు ఓ కళాకారుడు..
Scrap Arts: రాజుల కాలం నుండి నేటి వరకూ విగ్రహాలకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క విగ్రహాలు అనే కాదండోయ్ రకరకాల కళాకృతుల తో పాటు ఉద్యానవనాలలో ఏర్పాటు చేసే ప్రతిమలకు సైతం అప్పటి నుండి ఇప్పటి వరకు డిమాండ్ తగ్గక పోగా రోజు రోజుకు పెరిగి పోతూనే ఉంది. వీటితో పాటు వివిధ దేశాల లో ప్రముఖుల విగ్రహాలతో పాటు అక్కడి రాజకీయ నాయకుల విగ్రహాలు సైతం ఏర్పాటు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఐతే పూర్వం రాతితో చెక్కి విగ్రహాలను తయారు చేసేవారు,ఆ తరువాతి కాలం లో సిమెంట్ విగ్రహాలు, కాంస్యవిగ్రహాలు, ఆ తరువాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పి.ఓ.పి), ఫైబర్ వంటి వాటి తో విగ్రహాలు రకరకాల కళాకృతులను తయారు చేస్తున్నారు.
అయితే తన వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తూనే ఏదైనా ప్రత్యేక మైన రీతిలో కొత్తదనాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో స్క్రాబ్ ఐరన్ తో కళాఖండాలు తయారు చేయడం మొదలు పెట్టామంటాడు. రవిచంద్ర.మొదట్లో కొంత నిరుత్సాహపరిచినా ప్రస్తుతం తాము తయారు చేసే బొమ్మలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది అని రవిచంద్ర తెలియజేశారు. బెంగుళూరు ముంబై వంటి మహానగరాలలో తాము తయారు చేసే స్క్రాప్ ఐరన్ విగ్రహాలకు మంచి డిమాండ్ ఉందని రవిచంద్ర తెలియజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
గుంటూర్, ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 16, 2023 8:16 PM






















