తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ను నియమించబోతున్నారనే ఊహాగానాల మధ్య, ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సంచలన సూచన చేశారు. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుని, ముఖ్యమంత్రి బాధ్యతలు తన కుమారుడు, మంత్రి లోకేష్‌కు అప్పగించాలని ఓవైసీ అన్నారు.
























