దీని ప్రకారం, చర్లపల్లి – తిరుపతి (07017) రైలు జూలై 4 నుండి 27 వరకు, తిరుపతి – చర్లపల్లి (07018) జూలై 5 నుండి 28 వరకు, చర్లపల్లి – తిరుపతి (07251) జూలై 2 నుండి 30 వరకు, తిరుపతి చర్లపల్లి (07252) జూలై 3 నుండి 31 వరకు నడుస్తాయి.ఈ రైళ్లలో 1AC, 2AC, 3AC, స్లీపర్ , జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని SCR అధికారులు తెలిపారు. అందువల్ల రైల్వే ప్రయాణికులకు ఈ విషయాన్ని గమనించాలి. స్పెషల్ ట్రైన్ సర్వీసులు పొందొచ్చు. సౌకర్యవంతంగా జర్నీ చేయొచ్చు. స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి వస్తే.. ప్రయాణికులకు సులభంగానే టికెట్లు లభిస్తాయి. దీని వల్ల రద్దీ అనేది తగ్గుతుంది. ఫ్యామిలీతో ఊరు వెళ్లాలని భావించే వారికి స్పెషల్ ట్రైన్స్ వల్ల ఊరట లభిస్తుంది. అందరూ కలిసి సౌకర్యవంతంగా జర్నీ చేయొచ్చు. ఈజీగానే ట్రైన్ టికెట్లు బుక్ అవుతాయి.

























